గుజరాత్‌లో ఆరెస్సెస్‌ సేవ

మొన్నటికి మొన్న కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం జరిగింది. దీంతో చాలా మంది చనిపోయి, నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యకర్తలు రంగంలోకి దిగి ఆపన్నులను ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సేవలు చేశారు. ఆరెస్సెస్‌, సేవా భారతి కార్యకర్తలు చేసిన సేవలను అక్కడి చర్చి పాస్టర్లు కూడా బహిరంగంగానే మెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆరెస్సెస్‌ కార్యకర్తలు గుజరాత్‌లో అదే పని చేశారు. గుజరాత్‌లోని వడోదర, ద్వారక, మోర్బి, రాజ్‌ కోట్‌, ఆనంద్‌, ఖేడా, అహ్మదాబాద్‌ లలో వరదలు బీభత్సం సృష్టించాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 10 రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు రంగంలోకి దిగి, ఎప్పటిలాగే సమాజ సేవ చేశారు. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహార సామాగ్రిని పంపిణీ చేశారు. ఒక్క జామ్‌నగర్‌లోనే 80 మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు రక్షించారు. అలాగే సౌరాష్ట్ర ప్రాంతంలో గర్భవతులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో సుమారు 2 వేల ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఇక.. రాజ్‌ కోట్‌లో ప్రత్యేక వంట గదిని ఏర్పాటు చేసి, ప్రతి రోజూ వెయ్యి మందికి ఆహారం అందించారు.  అలాగే టంకారా, జామ్‌నగర్‌లో కూడా ఆహార ప్యాకెట్లను అందజేశారు.

వడోదర ప్రాంతంలో తీవ్రమైన స్థాయిలో వరదలు వచ్చాయి. దాదాపుగా ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. అయినా సరే స్వయంసేవకులు ముందుండి సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో డాక్టర్‌ హెడ్గేవార్‌ సేవా కమిటీ ఈ సహాయ కార్యక్రమాలను నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *