అయోధ్య రాముడికి ‘‘శ్రీరామార్చనం’’ పేరుతో సంగీత సేవ చేసిన స్వయంసేవకులు

‘‘శ్రీరామార్చనం’’ పేరుతో అయోధ్య రామ్ లల్లా ఆలయంలో ఆరెస్సెస్ స్వయంసేవకులు సంగీత సేవ చేశారు. పూర్తి గణవేషలో (యూనిఫాం) ధరించి, అత్యంత క్రమశిక్షణతో సంగీత సేవ చేశారు. ప్రదర్శనలో వేణు (వేణువు), శృంగ (స్వరద్, తుర్య, నాగాంగ, గౌముఖ్ సహా) మరియు శంఖం (బుగల్) వంటి వాయిద్యాలు ఉన్నాయి. పైగా స్వయం సేవకులు అయోధ్యలోని రామ్ పథ్ వెంబడి పథ సంచలన్ చేస్తూ లయ, శ్రావతలతో పథ సంచలన్ చేశారు. దీనిని చూసి స్థానికులు మంత్రముగ్ధులయ్యారు.

శ్రీ రామార్చనం కార్యక్రమం రాముడి పట్ల భక్తితో పాటు దేశభక్తికి అంకితం చేస్తున్నామని స్వయంసేవకులు ప్రకటించారు. ఢిల్లీకి చెందిన ఆరెస్సెస్ ఘోష్ దళ్ కి చెందిన స్వయంసేవకులు ఇందులో పాల్గొన్నారు. సరయూ నది నుంచి ఈ పథ సంచలన్ ప్రారంభమై, వీణా చౌక్ చేరుకున్న తర్వాత వివిధ రాగాలతో అమరులైన కరసేవకులకు నివాళులు అర్పించారు. తదనంతరం అక్కడి నుంచి హనుమాన్ గఢీకి చేరుకున్నారు. అక్కడ కూడా ప్రదర్శననిచ్చారు. అక్కడి నుంచి రాంపథ్ దగ్గర 10 నిమిషాల పాటు సంగీత సేవ చేశారు. చివరగా శ్రీ రామ జన్మభూమి ప్రధాన ఆలయ ద్వారం వద్ద శ్రీరామార్చన చేసి ముగించారు.

అయితే.. ఈ శ్రీరామార్చన మొత్తం కూడా భారతీయ శాస్త్రీయ రాగాలు, తాళాలపైనే ఆధారపడి సాగింది. పూర్తి శాస్త్రీయత, క్రమశిక్షణతో ఇది సాగింది. అయోధ్య నగరంలో భక్తి భావంతో, జాతీయ భావాలతో నిండిపోయింది.కార్యక్రమంలో వీర్ సావర్కర్ స్వరపరిచిన నాలుగు ప్రధాన గీతాలు “జయోస్తుతే”, “రామ్ స్తుతి”, “రామ్ భక్త్ లే చలా రే రామ్ కి నిషానీ” మరియు “శ్రీరాం చంద్రకృపాలు భజమాన్” పాటలను ప్రదర్శించారు.

సమాజంలో భారతీయ సంప్రదాయాన్ని, క్రమశిక్షణను, సాంస్కృతికతను, దేశభక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి శ్రీరామార్చన అన్న కార్యక్రమాన్ని సంకల్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నెలల తరబడి స్వయంసేవకులు శిక్షణ పొంది, సాధన చేశారని కూడా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *