పంజాబ్ లో వరదలు.. భోజనం ప్యాకెట్లు, నిత్యావసరాలు అందిస్తున్న స్వయంసేవకులు

పంజాబ్ లో వరదలు ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు సేవలందించడానికి ముందుకొచ్చారు. దాదాపు 1,700 మంది సంఘ కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే రంగంలోకి దిగారు. సేవా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. మారుమూల గ్రామాలకు కూడా స్వయంసేవకులు చేరుకొని, తమ సేవలను నిరంతరాయంగా అందిస్తూనే వున్నారు.

ఇదే విషయంపై పంజాబ్ ప్రాంత సంఘచాలక్ ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ… ఈ కష్టకాలంలో ఆపదల్లో వున్న ప్రతి ఒక్కరికీ సంఘ్ తన సేవలను అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 41 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడి ప్రజలకు తక్షణమే ఉపశమనం కలిగించడానికి, వారికి అవసరమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు.

అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వండిన భోజనం, రేషన్ ప్యాకెట్లు, తాగునీరు, టార్పాలిన్లు, దుప్పట్లు, మడత పెట్టే విధంగా సౌలభ్యంగా వున్న పడకలు, షెల్టర్లు, మందలు, ఓడోమోలతో పాటు పశువులకు మేత, వాటికి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కూడా స్వయంసేవకులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 12 వేల కుటుంబాలకు తమ సహాయాన్ని అందించారు స్వయంసేవకులు.

కపుర్తల, గురుదాస్ పూర్ లాంటి జిల్లాల్లో కూడా స్వయంసేవకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పాలు, బ్రెడ్,రేషన్, మంచి నీరు, ORS ప్యాకెట్లు, మందులు, క్యాండిల్స్, అలాగే తక్షణమే అవసరమైన వస్తువులను కూడా స్వయంసేవకులు అందిస్తున్నారు.ముకేరియన్‌లో, హలేద్, కోలియా, సింబ్లి మరియు మెహతాబ్‌పూర్ వంటి గ్రామాలలో వరద బాధిత కుటుంబాలకు స్వయంసేవకులు సహాయం అందించారు.

మెహతాబ్‌పూర్‌లో, నీరు అనేక అడుగుల ఎత్తుకు పెరిగి, ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. నీరు తగ్గిన తర్వాత, స్వయంసేవకులు సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి శుభ్రపరచడం మరియు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *