‘‘సేవా భారతి’’ ఆధ్వర్యంలో ‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌’’

సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌’’రన్‌ 9 గచ్చిబౌలిలో జరిగింది. బాలికల సాధికారత, కిషోరి వికాస్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం జరిగింది. 21/10/5 కిలో మీటర్ల విభాగాల్లో రన్‌ 9 ఎడిషన్‌ జరిగింది.ఈ రన్‌లో కార్పొరేట్‌ ఉద్యోగులు, కుటుంబాలు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 11 వేలకు పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు హాజరయ్యారు.

సమాజంలోని అభాగ్య వర్గాల అభ్యున్నతి కోసం సేవా భారతి తెలంగాణ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఆడపిల్లల సాధికారత కోసం ఉద్దే శించిన కార్యక్రమాల ప్రాముఖ్యతను అభినందించారు. ఇప్పటికే సేవా భారతి 10 వేల బాలికలకు పైగా ప్రభావితం చేసిందని, 2030 నాటికి లక్ష మంది లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

సేవా భారతి ప్రధాన కార్యదర్శి పరాగ్‌ అభయంకర్‌ మాట్లాడుతూ రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ వార్షిక కార్యక్రమం బాలికల అభ్యున్నతి కోసం ఎంతో తోడ్పాటుని స్తోందన్నారు. ఫ్రీడమ్‌ ఆయిల్‌, గ్లోబల్‌ డేటా, ఇన్ఫోసిస్‌, బీడీఎల్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌, ఫిల్టరేషన్‌ గ్రూప్‌, చబ్బ్‌, డిష్‌ టీవీ, ఈసీఐఎల్‌, టేక్వేదిత, సత్యనారాయణ జువెలర్స్‌, హ్యాపీ హైదరబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, హెచ్‌ సీయూ, తదితరులు సేవా భారతి కార్యక్రమానికి మద్దతిచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *