మహాకుంభ మేళా ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక పుష్టి.. యూపీ సర్కార్ ప్లాన్

ఉజ్జయిని కేంద్రంగా జరగబోయే మహాకుంభమేళా 2025 కి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షల్లో భక్తులు వస్తారని, వారికి తగ్గ ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు రైల్వే శాఖ కూడా ప్రత్యేకంగా 13 వేల రైళ్లు నడుపుతున్నాయి. కుంభమేళాతో అఖాడాలకి సంబంధించిన సాధువులు, సామాన్య ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోనున్నారు. అయితే… అనేక మందికి ఉపాధి కూడా దొరకనుంది.

ముఖ్యంగా ఈ మహా కుంభమేళా ద్వారా గ్రామీణ మహిళలకు ప్రత్యేకంగా ఉపాధిని కల్పించనుంది యోగి ప్రభుత్వం. కుంభమేళా ద్వారా భక్తితో పాటు గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కూడా దొరకనుంది. రాష్ట్ర జీవనోపాధి మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మహాకుంభ ప్రాంగణంలో వివిధ స్టాళ్లు, దుకాణాలను కేటాయించనుంది ప్రభుత్వం. జీవనోపాధి మిషన్ గ్రామీణ మహిళల సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

మాఘమేళా, కుంభమేళా, మహాకుంభ మేళా సమయంలో స్టాళ్లు, దుకాణాలు అనేక మందిని ఆకర్షిస్తుంటాయి. పవిత్రమైన స్నానాలు ఆచరించడమే కాకుండా ఆహారం, చిరుతిళ్లు, గృహ అవసరాల కోసం వస్తువులను కూడా ఈ స్టాళ్లల్లో అమ్ముతుంటారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇంతలా మహాకుంభమేళాలో ఆర్థిక వ్యవస్థ వుంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ మహిళలను చేర్చడమే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం ప్లాన్ వేసింది.

డిప్యూటీ కమిషనర్ రాజీవ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ సృష్టిలో గ్రామీణ మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ మేళాలో ఐదు క్యాంటీన్లను నిర్వహించే బాధ్యత గ్రామీణ మహిళలకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు.అలాగే 40 కి పైగా షాపులతో పాటు ఒక్కో సెక్టార్ లో 10 షాపులను కూడా వీరికే కేటాయించనున్నారు. దీని ద్వారా 5,000 మంది గ్రామీణ మహిళలకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి దొరకనుంది.

మరోవైపు గ్రామీణ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ మరియు షాపుల్లో విక్రయించే ఉత్పత్తులకు మహాకుంభ ద్వారా బ్రాండింగ్ లభించనుంది. పల్లె నుంచి వీధి వరకూ వీటి గుర్తింపును విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు.ఈ స్టాల్స్ లో అన్ని రకాల వస్తువులు కూడా దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం కారణంగా స్వెట్టర్లు, మఫ్లర్లు కూడా అమ్మనున్నారు.వీటిపై మహాకుంభ మేళా లోగోను కూడా వుంచనున్నారు. అలాగే ప్రసాదం, అంగవస్త్రాలపై కూడా మహాకుంభమేళా లోగో వుండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *