10 సంవత్సరాల్లో భారత విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది
గత 10 సంవత్సరాల్లో భారత విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైంది. 2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చింది. ఉగ్రవాదులకు ఎలాంటి నియమ నిబంధనలు వుండవు. అలాంటప్పుడు దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే వుంటుంది. ఎలాంటి నియమాలకు లోబడి వుండాల్సిన అవసరమే లేదు. ఒకవేళ, 26/11 ముంబై పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే.. తర్వాతి దాడులను మనం ఎలా నిరోధించగలం? సరిహద్దులకు బయట వున్నాం కదా.. మనల్ని ఎవరూ ముట్టుకోలేరని ఉగ్రవాదులు అనుకుంటారు. అది ఎంత మాత్రమూ నిజం కాదని మనం రుజువు చేయాలి.
-భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్