భారత మాత సంతోషిస్తే అనేక జన్మల ఋణం తీరిపోతుంది
మనందరికీ ఒకే ఒక తల్లి వున్నది. అది ‘‘భారతమాత’’. ఒక కన్న తల్లి నవ మాసాలు మోసి, పెంచి, పెద్దవాడ్ని చేసి రక్షించినటువంటి తల్లికి ఏమి చేసినా ఋణం తీరదంటారు. కానీ కొన్ని వందల జన్మల నుంచి మనకు తల్లిగా వున్నది భారతమాత… ఆ భారతమాతకు మటుకు ఎవ్వరూ ఋణం తీర్చుకోలేరు. విశేషమేమిటంటే తనకు తానై మాతృ ఋణం ఎవ్వరూ తీర్చుకోలేరు. మరి ఎలా తీరుతుందయ్యా? ఆ తల్లి నేను ఆనందించాను, నేను తృప్తి చెందాను, నిన్ను ఋణ విముక్తి చేస్తున్నాను, అని అమ్మ అనాలి. అప్పుడు ఋణం తీరుతుంది. భారతమాత ఆ మాట మనల్ని ఎప్పుడైతే అన్నదో అనేక జన్మల ఋణం తీరిపోతుంది. కానీ అనేక జన్మల ఋణం భారత మాత సంతోషిస్తే తీరుతుంది. ఆ ఋణం తీరితే వచ్చే లాభం ఏమిటి? అంటే.. ‘ఋణం’’ అనేది తీరిపోతే పునర్జన్మ వుండదు. అది భారతీయులందరికీ కూడా ఆదర్శవంతం. ఒక జన్మలో మాతృదేశ భక్తి వల్ల దేశమాత యొక్క ఋణం తీర్చుకుంటే చాలు. అంతకన్నా కోరుకోవలసిందేమీ లేదు.
-సద్గురు శివానంద మూర్తి గారు