వీహెచ్ పీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాధు సంతుల సమావేశం.. కీలక నిర్ణయాలివీ
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహా కుంభమేళాలో సాధు సంతుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి దేశంలోని వివిధ సాధు సంతులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమ్మేళనంలో హిందూ ఆలయాల స్వయం ప్రతిపత్తి, జనాభా పెరుగుదల, సాంస్కృతిక పరిరక్షణ, దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపారు. అలాగే హిందూ సమాజానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అందులోని కీలక అంశాలివీ…
1. ఆలయాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయాలి. వాటి నిర్వాహణ బాధ్యతను హిందూ సమాజానికే అప్పగించాలి.
2.దేశంలో జనాభా అసమతుల్యతకు ప్రధాన కారణం హిందువుల సంతానోత్పత్తి రేటులో తగ్గుదలే కారణం. ప్రతి హిందూ కుటుంబం ముగ్గుర్ని కనాలి.
3. వక్ఫ్ బోర్డుపై నియంత్రణ చేయాలి. హక్కులను పరిమితం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వం చూపిన చొరవను సమ్మేళనం ప్రశంసించింది. వక్ఫ్ సవరణలకు పార్లమెంట్ లోని ఎంపీలందరూ సహకరించాలి.
4.అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తైందని, మధుర, కాశీ నిర్మాణాలు కూడా చేసేందుకు సమాజం కట్టుబడి వుంది. 1994 లో సమాజం చేసిన నిబద్ధతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది. ఆరెస్సెస్ తో పాటు సాధువులు, హిందూ సమాజం, విశ్వహిందూ పరిషత్ కట్టుబడి వుంది.
5. వీటన్నింటితో పాటు దేశ అభ్యున్నతికి, సామాజిక సమరసతకు, సంస్కృతి పరిరక్షణకు, పర్యావరణ పరిరక్షకు, హిందూ కుటుంబ వ్యవస్థ పరిరక్షణ కూడా చేయాలి.