సైంధవ లవణం

మనం ప్రతి రోజు చేసుకొనే కూరల్లో ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే.ఊపు లేనిదే గడవదు. అయితే ఉప్పు ఎక్కువైతే హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అంతేకాక రక్తపోటు ఉన్నవారు ఉప్పును చాలా తక్కువగా ఉపయోగించాలి.

ఉప్పుకు బదులు సైంధవ లవణంను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాక మనం రోజు వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం చాలా తక్కువ పడుతుంది. అంటే మూడు స్పూన్ల ఉప్పును వాడే బదులు రెండు స్పూన్ల సైంధవ లవణం సరిపోతుంది.

సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు. కాల్షియం, కాపర్‌, ఐరన్‌, మెగ్నిషియం, పాస్ఫరస్‌, పొటాషియం, సిలికాన్‌, సల్ఫర్‌, జింక్‌, అయోడిన్‌ వంటి 84 రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషణను ఇస్తాయి.

ఈ సైంధవ లవణం కొంచం మధురంగా ఉంటుంది. హృదయానికి బలం ఇస్తుంది.  శరీరంలో వాత, పిత్త, కఫ దోషములను పొగొడు తుంది. శరీరంలో వేడి పుట్టిస్తుంది.

కళ్లకు చాలా మేలు చేస్తుంది. జీర్ణశక్తిని వృద్దిచేస్తుంది. వాతాన్ని హరిస్తుంది. పుళ్లను నయం చేస్తుంది. దీనిని వాడటం వలన మలబద్దకం పోతుంది.

కడుపులో గ్యాస్‌ పట్టినప్పుడు దీనిని గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగించి వాంతి చేయిస్తే కడుపు శుభ్రపడుతుంది.

ఒక చెంచా చనుబాలలో చిటికెలో పావు వంతు సైంధవ లవణం కలిపి కంటిలో 2 చుక్కల చొప్పున వేస్తే కంటి సమస్యలు నివారణ అవుతాయి.

గమనిక: దీనిని మోతాదుకు మించి వాడితే  పైత్యం చేస్తుంది.  అతిసార వ్యాధిని కలుగచేస్తుంది.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *