సజ్జలు
* 100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్ 66 గ్రా , ప్రొటీన్స్ 10 గ్రా, ఫాట్స్ 4.5 గ్రా , కాల్షియం 50 గ్రా , ఫాస్ఫరస్ 350 మి.గ్రా , ఐరన్ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా , పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్ A -2205 I .U , B1 – 329 మి.గ్రా , నియాసిన్ 3.2 మి.గ్రా ఆక్సాలిక్ ఆసిడ్ 14 .5 మి.గ్రా ఉన్నాయి .
* 100 గ్రా సజ్జలు జీర్ణం అగుటకు మూడున్నర గంటలు పడుతుంది.
* సజ్జలలో మాంసకృత్తులుకు అవసరం అయిన ఆర్డీనైన్ మొదలుకొని హెలైన్ వంటి ఎమైనో ఆసిడ్స్ తగినంతగా ఉన్నాయి. సజ్జలలో ఇంకా ఐరన్ , విటమిన్ A , B లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఇవి మంచి బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చు.
* సజ్జలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన రొట్టెలను తేనెతో కలిపి ప్రతినిత్యం ఉదయం తింటే శరీరానికి మంచి బలం కలుగుతుంది.
* నిద్ర పట్టనివారు , మొలల వ్యాధితో బాధపడేవారు , నరాల బలహీనంతో బాధపడేవారు పైనచెప్పినట్టు సజ్జరొట్టెలను తేనెతో కలిపి తీసుకుంటె మంచి ఫలితం కనిపించును.
* సజ్జలను అధికంగా తీసుకుంటే యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మితంగా తీసుకోవాలి.
* మధుమేహ వ్యాధిగ్రస్థులు , శుక్రంనష్టం , తెల్లబట్ట సమస్య ఉన్నవారు, మలబద్దకం, క్షయ , గనేరియా , సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు ఉన్నవారు సజ్జలు తినకూదు.