సార్మడీలు, పటేల్లకు సత్కారం

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలా, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాలలోని 200 గ్రామాలకు చెందిన సార్మ డీలకు, పటేళ్లను డిసెంబర్‌ 15,17 తేదీల్లో ఉట్నూర్‌ లో చందుపల్లిలో ఘనంగా సత్కరించారు.

వనవాసీలలో గోండులు, పరధానులు, కొలాములు, నాయకపోడులు, ఆంధ్‌లు, తోటిలు.. మొదలైన తెగల పెద్దలు ఎటువంటి భేదభావాలు లేకుండా, కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. ఉట్నూర్‌ ఎంపిటిసి జైవంత రావు, బేలా సార్మడి సోన్‌ రావుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది వనవాసీలు తరలివచ్చారు. గోండులలో జన్మిం చిన మహనీయులైన కొమరంభీమ్‌, రాంజీగోండు, బిర్సా ముండా, తిలకామాంరీa, రాణీగైడిన్లు, రాణి దుర్గావతి చిత్రాలు, వనవాసీలు జరుపుకునే పండుగల చిత్రాలతో కూడిన మెమెంటోలు, చలి దుప్పట్లు, హనుమాన్‌ చాలీసా పుస్తకాలను వారికి పంపిణీ చేశారు.

వనవాసీలు హిందువులు కాదని, హిందూ సంస్కృతి కాదని, తమది ప్రత్యేక మతం, సంస్కృతని చెప్తూ, వేర్పాటువాదాన్ని రెఛ్ఛగొడుతున్న నేపథ్యంలో సామాజిక సమరసత వేదిక వనవాసీ గూడెంలోని ప్రజలలో తమ సంప్రదాయాల పట్ల స్వాభిమానాన్ని గుర్తుచేస్తూనే, పురాణ కథలలో, చారిత్రక గాథలో, నెలవారీ పండుగలలో కనిపించే సామీప్యతను తెలిపి, మనందరిది ఒకే దేశం,ఒకే సంస్కృతని, మనం కలిసి మెలిసి జీవించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. అలాగే రానున్న తరానికి తమ పద్దతులను నేర్పాలని, రాముడు- శబరి, భీముడు-హిడిరబి, అర్జునుడు-ఉలూపి, కృష్ణుడు-రుక్మిణిల మధ్య సంబంధం మనందరం ఒకటేనని తెలియజేస్తుందని వక్తలు తెలిపారు.

ఆదిశేషువును వనవాసీలు ఇలవేలుపుగా కొలుస్తూ, నాగదేవత కృపా కటాక్షంతో అలాగే కురువంశంలోని కౌరవ పాండవుల వంశీకులై , నాలుగు యుగాల చరిత్రను తమ కథలుగా చెప్పుకుంటూ, 12 నెలలలో వచ్చే ప్రతి పండుగను శ్రధ్ధా భక్తులతో జరుపుతున్న గిరిజనుల ప్రాచీన గోండి భాష, నాట్యం, సాహిత్యం, ఆచార సంప్రదాయ కళలను కాపాడాల్సిన బాధ్యతను వక్తలు గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *