సామలు
సామలు తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యల్ని ఇది తొలగిస్తాయి. శరీరానికి తగిన పోషకాలు అందాలంటే చిరుధాన్యాలు కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటుండాలని డాక్టర్లు చెబు తుంటారు. అయితే సామలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!
సామలు – ఉపయోగాలు
పైత్యం ఎక్కువ అవ్వడం వలన భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇది తరిమికొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్లు దీనిని తీసుకోవడం వలన ఈ సమస్యలు దూరమవుతాయి.
సామలుతో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా, తియ్యగా, వగరుగా ఉంటుంది. ఈ బియ్యముతో పరమాన్నం చేస్తే అద్భుతమైన రుచితో ఉంటుంది.
మలమును బంధింస్తుంది. శరీరము నందు కఫమును, పైత్యమును హరిస్తుంది. కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం.
ఆడవారిలో పీసీఓడీ ఉంటే దానిని కూడా దీనితో తగ్గించుకోవచ్చు. సామలు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
నిత్యం సామలను ఆహారంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.