హంపిపీఠాధిపతి రాక..వెల్లివిరిసిన సమరసత
పశువుల తోలును లందలో (నీళ్లు వున్న తొట్టి) నానపెట్టి, చెప్పులు కుట్టే మాదిగలకు గౌరవనీయ మైనది, రేణుకా ఎల్లమ్మ తలను ఇదే లందలో దాచి పెట్టినట్లు జాంబవ పురాణం చెపుతోంది.
అందె గ్రామంలోని ఎస్ సి బస్తీ లోని ఎల్లమ్మ దేవాలయం దర్శించి,ఆ ప్రక్కనే ఉన్న ‘‘లంద’’ వద్ద దీపం వెలిగించారు.
అలాగే అందె గ్రామంలోని హనుమాన్ దేవాలయం, లక్ష్మీ దేవాలయం, శివాలయం దర్శించి తగు సూచనలు అందజేసి, ఆ గుళ్ల పవిత్రతను కాపాడాలని సూచించారు.
అందెలో లింగాభిషేకం..
అలాగే నర్మదా నదిలో లభించే బాణ లింగాలను అన్ని కులాలకు చెందిన 200 కుటుంబాలకు అందించి,వారి ద్వారా ఏప్రిల్ 19 న శివాలయ ప్రాంగణంలో లింగాభిషేకం చేయించారు. హిందూ ధర్మం మూఢ నమ్మకాలతో కాదు సైంటిఫిక్ ఆలోచనతో విస్తరిస్తున్నదని, ఆచార సాంప్రదాయాల వెనక ఉన్న పరమార్థం అందరూ తెలుసుకుని, తరువాతి తరాలకు నేర్పాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ, దైవభక్తి, దేశ భక్తిని కలిగి ఉండాలని, తెలుగు భాష, వేషంతో పాటు, ఆరోగ్యం ఇచ్చే ఆహారం పండిరచి తీసుకోవాలని, ఉపవాసాలు, లింగాభిషేకాలపై విదేశీయులు పరిశోధన చేసి, సానుకూల దృక్పథం పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్వామీజీ వివరించి చెప్పారు.
అందె గ్రామానికి దగ్గరలో వున్న నక్కల కులానికి చెందిన పిట్టల బస్తీ ముత్యంపేట గ్రామాన్ని సందర్శించి, ఉపాధి అవకాశాలపై వివరించి చెప్పారు.
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో మొదటిసారిగా అన్ని వర్గాలను కలిపి ఒక దగ్గర చేర్చి, పూజా కార్యక్రమం నిర్వహించటం వల్ల, సమరసతాభావం వెల్లివిరిసింది.
శివకుమార్, బాలగణేష్ మొదలైన నాల్గు కుటుంబాల వారు కొన్ని సంవత్సరాలుగా శివాలయం కేంద్రంగా శివరాత్రి పండుగ ఘనంగా జరుపుతారు. Rవీూ జి.రామచంద్రం, మాట్ల సుమన్, కడారి కనకయ్య, కనక రాజు, నరేష్ యాదగిరి, కరుణాకర్, పర్షురామ్ తదితరులు నిర్వహణలో పాల్గొన్నారు.
జగిత్యాల నుండి వచ్చిన లక్ష్మీ నారాయణ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు.