సనాతన ధర్మంలోకి పునరాగమనం

ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లో వేరువేరు ప్రాంతాల్లో మొత్తం 180 మందికి పైగా సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ముజఫర్‌ ‌నగర్‌ ‌లో 12 కుటుంబాలకు చెందిన 80 మంది ఇస్లాంను విడిచి స్వధర్మానికి తిరిగి వచ్చారు. బాగ్రాలోని యోగ్‌ ‌సాధనా ఆశ్రమంలో మహంత్‌ ‌స్వామి యశ్వీర్‌ ‌మహరాజ్‌ ‌సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 80 మంది సభ్యులు తాము ఇంతకు ముందు హిందువులమేనని, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ ‌తమను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని వారు ఆరోపించారు.

గాయత్రీ మంత్రాన్ని పఠించి, హిందూ మతపరమైన కంకణాన్ని స్వీకరించడం ద్వారా ఘర్‌ ‌వాపస్‌ అయ్యారు. యశ్వీర్‌ ‌మహరాజ్‌ ‌గంగా నీటితో వారిని శుద్ధి చేశారు. హిందూ మతంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్న కవిత అనే మహిళా మాట్లాడుతూ, ‘‘12 సంవత్సరాల క్రితం, ఆజం ఖాన్‌ ‌మమ్మల్ని ఇస్లాంలోకి మార్చమని బలవంతం చేశాడు. మా సంపదను, ఆస్తులను కూడా లాక్కున్నాడు. అతను చాలా ఇతర ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను అనేక ఇబ్బందులకు గురిచేశాడు’’ అని చెప్పారు.

అలాగే క్రిస్మస్‌ ‌వేడుకల మధ్య బులంద్‌షహర్‌ ‌జిల్లా ఖుర్జాలో 20 వాల్మీకి కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా వేద మంత్రాల మధ్య హిందూ మతాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మీనాక్షి సింగ్‌ ‌సహాయంతో వాల్మీకి సంఘంతో పాటు రాష్ట్రీయ చేతనా మిషన్‌ ‌ద్వారా ‘ఘర్‌ ‌వాపసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ మతం స్వీకరించిన సందీప్‌ ‌వాల్మీకి మాట్లాడుతూ ‘‘అనారోగ్యంతో బాధపడుతున్న నా బిడ్డ కోసం క్రైస్తవుడిని అయ్యాను. కానీ మా అమ్మ చనిపోయాక, హిందూ ధర్మం ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని మా అమ్మ కోరిన ప్పటికీ, వారు క్రైస్తవమతం ప్రకారం కర్మలు చేయమని మమ్మల్ని బలవంతం చేశారని’’ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *