భారత్ ప్రపంచానికి తీర్థ క్షేత్రం కాగలదు… ఈ మహాకార్యాన్ని మనం సాధించాలి

భారత భూమిపై ఐకమత్యం నెలకొల్పి మనం ప్రపంచాన్ని మురిపించాలి. ఈ భారత భూమి మానవ జాతికి తీర్థక్షేత్రం కాగలదు. అన్ని మతాలు, భిన్న సంస్కృతులు ఇక్కడ కాపురం చేస్తున్నాయి. ఇది విని అన్ని దేశాలూ భారత భూమికి దగ్గరకాగలవు. ఈ చారిత్రాత్మక మహాకార్యాన్ని మనం సాధించాలి. ఈ మహా ధ్యేయం మనల్ని ఎలుగెత్తి పిలుస్తుంది. భారతీయ సంస్కృతీ ఉపసాకులందరూ శ్రద్ధతో త్యాగపూర్వకంగా దీనికై నడుం కట్టాలి. తొందరపాటు వద్దు. స్వార్ధం వద్దు. సోమరితనం వద్దు. సమాజంపై ప్రేమ, చింతన అవసరం. సమాజాన్ని ఎలా సుఖవంతంగా వుంచాలో అన్న చింతనలోనే వుండాలి.

 

-` సానే గురూజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *