దైవ భక్తి ఎంత ముఖ్యమో…. దేశ భక్తి కూడా అంతే ముఖ్యం : శంకర విజయేంద్ర సరస్వతీ
భారత దేశ ఉజ్జ్వల భవిషత్య్తు కోసం లౌకిక అభివృద్ధి ఎంత అవసరమో, ధర్మవికాసం, సంస్కృతి వికాసం కూడా అంతే ఆవశ్యకమని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. ఈ రెండూ వికసితం జరిగినప్పుడే భారత్ కి ఉజ్వలత సాధ్యమన్నారు. భారత దేశ ఉన్నతే ప్రపంచ ఉన్నతి అని, భారత్ ఉజ్వల భవిష్యత్తుతో ప్రపంచంలో శాంతి స్థాపనకి దోహదపడుతుందన్నారుయ ప్రారంభోత్సవం వారణాసిలో జరిగింది. ఈ ఆస్పత్రిని వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర విజయేంద్ర సరస్వతీ మాట్లాడుతూ… భారత్ విశ్వగురువు స్థానానికి చేరుకోవడానికి ప్రజలందరూ ఈశ్వరుడ్ని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. భారత్ అద్భుతమైన అభివృద్ధిలో పయనిస్తోందని, దానికి ముఖ్య కారణం అద్భుతమైన నాయకత్వం వుందని ప్రశంసలు కురిపించారు.
దేశం అభివృద్ధిలో పయనించాలంటే వ్యక్తి ఎంత ముఖ్యమో… వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యమన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లే, అందర్నీ కలిపే వ్యక్తి కావాలన్నారు. ఈ లక్షణాలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలో పుష్కలంగా వున్నాయన్నారు. దేశానికి మంచి నాయకుడు దొరకడం కూడా ఈశ్వర కృపేనని, ఈశ్వరుడి కృప, సాధు సంతుల కారణంగా ప్రధానిగా మోదీ ఈ దేశానికి దొరికారన్నారు. ప్రేమ, శ్రద్ధ, కరుణ అన్న సద్గుణాలతో ప్రధాని మోదీ ఈ దేశాన్ని పాలిస్తున్నారని, పేదల కష్టాలను దూరం చేయడానికి పనిచేస్తోందని పేర్కొన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచానికే భారత్ ఆదర్శమన్నారు. సనాతన ధర్మం వైజ్ఞానికమని, అదో విజ్ఞానమని అన్నారు. సనాతన ధర్మం ఓ విశ్వాసమని, అదో వికాసమని అన్నారు. అందుకే విశ్వాసం, వికాసం కూడా అవసరమన్నారు.
ఓ పౌరుడికి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా వుండాలని పరమాచార్యులు అనేవారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడైతే అత్యావశ్యకముందో అక్కడ శంకర నేత్రాలయాల స్థాపన జరుగుతోందన్నారు. వారణాసి అభివృద్ధి కోసం కూడా మోదీ విశేషంగా కృషి చేశారని, వారణాసి కారిడార్ ఓ అద్భుతమని స్వామీజీ కొనియాడారు. వారణాసిని ఓ ఆనందవనంగా తీర్చిదిద్దారన్నారు. కశ్మీర్ లో కూడా ఎన్నికల ప్రక్రియ అద్భుతంగా జరిగిందని ప్రశంసించారు. మోదీతో తనకు 1997 నుంచి పరిచయం వుందన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనంతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రభుత్వం ఎలా సమతుల్యం చేయగలిగింది? భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని, దాని భౌతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనంగా సోమనాథ్, కేదార్‌నాథ్ వంటి పూజ్యమైన ప్రదేశాలలో చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన ఉదహరించారు.
న్యాయస్థానం ద్వారా దేవస్థానం నిర్మాణం కోసం ప్రధాని మోదీ విశేషంగా కృషి చేశారన్నారు. అయోధ్య నిర్మాణం కోసం విశేష ప్రయత్నాలు జరిగాయన్నారు. భారత్ సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని, మంగళ్ యాన్, చంద్రయాన్ తో పాటు, టెక్నాలజీ అభివృద్ధి పాటు రామ మందిర ప్రతిష్ఠాపన కూడా జరిగిందన్నారు. ఉజ్జయిని కేంద్రంగా మహాకుంభమేళా జరగబోతోందని, గతంలో అత్యద్భుతంగా కుంభమేళా జరిగిందని ప్రశంసించారు. ధన సంపద, ఉద్యోగ సంపాదన లాగా పుణ్య సంపాదన కోసం కూడా ప్రజలు ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్ర, సర్వాంగీణ వికాసం కోసం అందరూ ప్రయత్నాలు చేయాలని, ప్రార్థనలు కూడా చేయాలని విజయేంద్ర సరస్వతీ పిలుపునిచ్చారు.