సంకీర్తన, భజన ద్వారా ‘‘అటవీ కార్చిచ్చు’’పై ప్రజల్లో విశేష అవగాహన కల్పిస్తున్న మహిళా బృందం

అటవీ సంపద ఇప్పుడు లోకంలోనే అత్యంత కీలకమైన సంపద. అడవులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కూడా అటవీ సంపదను రక్షించుకునే విషయంలో అనేకంగా జాగృత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఒడిశాలో మాత్రం మహిళల నేతృత్వంలో విశేషంగా అటవీ సంపదను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన మహిళలు అటవీ కార్చిచ్చుపై సంకీర్తన ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ బృందానికి ప్రమీలా ప్రధాన్ అనే మహిళ నాయకత్వం వహిస్తోంది.

ఈ ప్రయత్నాలు ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరుగుతోంది. పర్యావరణంపై, అడవీ సంపదపై, అడవుల సంరక్షణపై ఈ మహిళల బృందం విశేషంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహిళలు తమ బృందానికి ‘‘రాధాకృష్ణ సంకీర్తన మండలి’’ అని పేరు కూడా పెట్టుకున్నారు. వీరు సంకీర్తనలు చేస్తూ.. అటవీ కార్చిచ్చుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. అలాగే భజనలు చేస్తూ కూడా అటవీ కార్చిచ్చుపై ప్రజల్లో అవగాహన తెస్తున్నారు.

ఈ ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోదీని విశేషంగా ఆకర్షించాయి. తాజాగా ఆదివారం జరిగిన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ మహిళలు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ విశేషంగా మెచ్చుకున్నారు. ‘‘భారత దేశ వైవిధ్యం జానపదాల్లో, సంప్రదాయాల్లో కనిపిస్తుంది. కానీ కీర్తన అన్న సంప్రదాయం ద్వారా అటవీ మంటల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీని గురించి మీరు విన్నారా? మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. కానీ ఒడిశాలోని కియోంఝర్‌లో ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పని జరుగుతోంది. ఇక్కడ రాధాకృష్ణ సంకీర్తన మండలి అనే బృందం వుంది. భక్తితో పాటు, ఈ బృందం పర్యావరణ పరిరక్షణ మంత్రాన్ని కూడా చెబుతోంది ’’ అని మోదీ వెల్లడించారు.

ఈ మహిళా బృందం గ్రామ గ్రామానికి ప్రయాణిస్తుంది. అటవీ సంరక్షణ, కార్చిచ్చుల హానికరమైన ప్రభావం గురించి అవగాహన కల్పిస్తోందని, భక్తి గీతాలను కూడా దీనికి జోడిస్తున్నారు. దీని ద్వారా మన పరిసరాలను కాపాడుకోవడం అనేది ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రమీలా ప్రధాన్ ని కూడా ప్రశంసించారు. ‘‘ఈ బృందం భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ మంత్రాన్ని కూడా జపిస్తోంది. దీనికి చొరవ తీసుకున్నవారు ప్రమీలా ప్రధాన్. ఆమే ప్రేరణ అందరికీ. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సంప్రదాయ పాటలను, సాహిత్యాన్ని జోడిస్తున్నారు. ఈమె బృందం గ్రామ గ్రామానికీ తిరుగుతోంది. అటవీ కార్చిచ్చు ఎంత నష్టం కలిగిస్తుందో భజనల ద్వారా చెబుతున్నారు.’’ అని మోదీ పేర్కొన్నారు.

వేసవి కాలంలో పర్యటిస్తూ..

ఈ యేడాది వేసవి కాలంలోనూ ప్రమీలా ప్రధాన్ ఈ జాగరణ చేశారు. వేసవి కాలంలో తన చుట్టుముట్టూ వున్న గ్రామాలకు వెళకలి, సంకీర్తనలు చేస్తూ అటవీ కార్చిర్చు గురించి అవగాహన కల్పించారు. దీంతో ప్రజలను విశేషంగా ఆకర్షించింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. అయితే మధ్యలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. కానీ.. 2021 లో సమీప గ్రామాల నుంచి సభ్యులను తీసుకొచ్చి… మండలిని తిరిగి పునరుద్ధరించారు.

అలాగే తన బృందంలోని వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా కూడా ప్రమీలా వుంటుంది. తన బృందంలో 20 మంది సభ్యులుంటారు. 10 మంది మహిళలు వుంటారు. ఇందులో బాలకలు కూడా వుంటారు. అయితే మహిళలు సంకీర్తనలు చేస్తుంటే పురుషులు వాయిద్యాలను వాయిస్తారు.

గత 5 సంవత్సరాలలో ఈ బృందం జిల్లాలో కనీసం 40 ప్రదేశాల్లో అవగాహన తీసుకొచ్చారు. పండగల సమయంలో, చిన్న చిన్న కార్యక్రమాల సమయంలో, వివాహాల సమయంలో… ఇలా మేము ప్రదర్శనలిచ్చారు, అక్కడ కూడా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. ఇలా ఈ బృందానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. డిమాండ్ కూడా ఏర్పడింది. దీంతో అటవీ అధికారులు కూడా భజన, సంకీర్తనను ప్రదర్శించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో వారి సారథ్యంలో కూడా చేశారు. ఇందులో అటవీ మంటలు ఎలా సంభవిస్తాయి? దాంతో జీవనోపాధికి ఎలా నష్టం కలుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తారు.

ఇంకో విషయం ఏమిటంటే ఈ బృందంలోని మహిళలు, పురుషులందరూ వ్యవసాయదారులే. అలాగే కలపపై ఆధారపడతారు. దీంతో అడవులతో వారికి సాన్నిహిత్య సంబంధం వుంది. వేసవిలో, మనలో చాలా మంది కట్టెలు, సాల్ గింజలు, కెండు ఆకులు, మహువా పువ్వులు, ఉసిరి మొదలైన NTFP సేకరించడానికి అడవిపై ఆధారపడతాము. వేట కోసం ఒక వ్యక్తి నిప్పు పెడితే, అది మొత్తం అడవికి వ్యాపించి అంతా నాశనమవుతుంది” అని వాపోయారు.

మార్చి మాసం నుంచి అటవీ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బృందం విశేషంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అటవీ మంటల వ్యాప్తి, వాటి ప్రభావం, పర్యావరణ సమస్యలు, జీవనోపాధి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *