సంక్రాంతి సందడి

సంక్రాంతి పండుగ రాగానే తెలుగు రాష్ట్రాలలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. దేశ వ్యాప్తంగా ఉన్నరాష్ట్రాలలో సంక్రాంతి పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. పేరు ఏదైనా.. సంక్రాంతి అనగానే పాడి, పంటలతో ముడిపడిన పల్లెపండుగగానే గుర్తొస్తుంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా శ్రమ జీవుల కష్టానికి ఈ పండుగ అద్దం పట్టేలాఉంటుంది. పంటలు చేతికొచ్చే సమయానికి సంక్రాంతి పండుగను జరుపుకోవడం మరోవిశేషం. ముఖ్యంగా వ్యవసాయానికి..బ్రతుకుదెరువుకు అండగా నిలిచే ప్రత్యక్ష దైవమైన ఆసూర్యదేవుణి? కొలిచే ప్రత్యేక పండుగే ఈ సంక్రాంతి అనిచెప్పుకోవచ్చు. అంతే కాకుండా అన్నపూర్ణను ఇంటింటికి అందించేందుకు తమకు సహకరించే పాడి పశువులకు రైతులుక తృజ్ఞతను చూపించడం సంక్రాంతి పండుగలో ఉన్న ఆత్మీయ భావాన్ని మన కళ్ళకు కడుతుంది.

ప్రాచుర్యంలో ఉన్న కథల ప్రకారం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజును భారతీయులు పర్వదినంగాజరుపుకుంటున్నారు. మకర రాశిలోని భానుడి సంక్రమణనేసంక్రాంతిగా అభివర్ణిస్తారు. పుష్యమాసం చివరి రోజుల్లో వచ్చే పండుగ సంక్రాంతి. ఈ పండుగను సూర్యమాణం ప్రకారం జరుపుకుంటారు. పుష్య మాసమంతా శుభకార్యాలు, పండుగలు, పుణ్యకార్యాలకు దూరంగా ఉండడం ఆచారం. అందులోనూ సకార్యాలకు పుష్యమాసాన్ని అంత అనువైనదిగా భావించారు. అందుకు శాస్త్రీయమైన కారణం లేకపోలేదు. డిసెంబరు, జనవరి మాసం తొలి నాళ్ళలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలువివిధ రకాలైన రోగాల బారిన పడుతుంటారు. కాబట్టి వేడుకలు జరిపితే వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు. ఇలా ఎంతోలోతైన ఆలోచనలతో మన పూర్వీకులు ఆచార, వ్యవహారాలను, సంప్రదాయాలను రూపొందిం చారు. అయితే సంక్రాంతి పండుగనాటికి చలి ప్రభావం తగ్గుతుంది. శివరాత్రిలోపు శివ శివ అనుకుంటూ శీతాకాలం వెళ్ళిపోతుంది. అందుకే సంక్రాంతిని కేవలం పాడి, పంటల పండుగగానే కాకుండా.. శుభకార్యాలను ప్రారంభించేందుకు అనువైన కాలంగా పరిగణి స్తారు.అంతేకాకుండా పంటలు కూడా ఇంటికి చేరి.. ప్రజలకు సంపద ఉంటుందనే నిగూఢార్థం కూడా సంక్రాంతి పండుగలో ఉంది. మహిషాసురుడిని అంత మొందించడానికి అమ్మవారు కారదం, దేవహుతి ఋషుల ఆశ్రమానికి సంక్రాంతినాడే అడుగిడినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అయితే భారత దేశ దక్షిణ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. ముఖ్యంగాఆంధ్ర ప్రాంతంలో ఇదే పెద్ద పండుగ. గుజరాత్‌, ‌మహారాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో మకర సంక్రాంతి, ఉత్తరాయణంగా, ఉత్తరప్రదేశ్లో కిచేరి, పంజాబ్‌, ‌హర్యాణ, హిమాచల్‌ ‌ప్రదేశ్లలోలోహ్రి, మాఘి పండుగగా జరుపుకుంటారు. ప్రయాగ, గంగా, జమునా నదులలో అక్కడి రాష్ట్రాల ప్రజలు లొహ్రీ సందర్భంగానది స్నానాలు ఆచరిస్తారు. అయితే ఉత్తరాదిలో కేవలం ఒక్కరోజుమాత్రమే జరుపు కుంటారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రం మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ సాగుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలుగా వేడుకలను నిర్వహిస్తారు. భోగి రోజుపొంగలిని చేసి వరుణ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరుసటి రోజు చేసిన పొంగలిని సూర్యునికి నివేదిస్తారు. మూడవరోజు పాడి పశువులకు స్నానం పోసి.. అలంకరించి కుటుంబసభ్యులంతా ఎంతో ఆనందంగా గడుపుతారు.

సంక్రాంతి పండుగ సమయంలో చెప్పుకో వలసింది పిండివంటల గురించే. నోరూరించడమే కాకుండా శరీరానికి పుష్టినికూడా అందిస్తాయి. బియ్యంపిండి, గోధుమ పిండి, శనగపిండి, జొన్నపిండి ఇతర పిండ్లతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలుచేస్తాయి. అంతేకాకుండా నువ్వులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉండలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలుపు కుంటూ నువ్వుల ఉండలను పంచుకుంటారు. పిండివంటకాలు శరీరానికి పుష్టిని అందిస్తాయి. అదే సమయంలో వేడికూడా చేస్తాయి. చలికాలంలో కలిగిన రుగ్మతలు తొలగేందుకు కావలసిన రోగ నిరోధక శక్తి పిండివంటలు, నువ్వులు బెల్లం ద్వారా శరీరానికి పెంపొందు తుంది. పరమాన్నాలు, పాల పొంగలులలోని ప్రొటీన్లు, విటమిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు. ఎందుకంటే పిండి వంటల్లో వాడే జొన్నలు, గోధుమలు, బియ్యం పిండ్లతో హార్లిక్స్, ‌బూస్ట్, ‌బోర్రవిటాలంటూ పొడులను చేసి ఫ్లెవర్ల పేర్లతో వ్యాపారం చేస్తున్న విషయాన్నిమనం చూస్తునే ఉన్నాం. విదేశీ సంస్థలు చెప్తేగాని నమ్మని స్థాయికి మన మనసు చేరిపోయింది. మన ఆచారాలలోనే మనపూర్వీకులు మన కోసం ఆరోగ్యకర ఆహార అలవాట్లను పొందుపరచారనే దానికి సంక్రాంతి పండుగ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

– లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *