‌ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ – సంస్కృత భాష

సంస్కృతం ఒక భాష మాత్రమే కాదు, అభ్యాసన పద్దతిని ప్రతిబింబించే ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ.

సంస్కృత భాష ద్వారానే భారతదేశం శతాబ్దాలుగా తన ఉనికిని దేదీప్యమానంగా, నిరంత రాయంగా చాటుకుంటున్నది. మన దేశ భవిష్యత్తు ప్రభావవంతమైన సంస్కృత భాషపై ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో మన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రధాన స్రవంతి లోని పాఠ్యాంశాల నుండి అత్యున్నత మేధాశక్తి, జ్ఞానం, చురుకుదనం ఉన్న సంస్కృత భాషను తీసివేస్తు న్నాయి. జీవితంలోని అన్ని దశలలో సంస్కృత భాష పునరుత్థానం కావడం అంటే అది మనదేశ నిజమైన స్ఫూర్తిని, దాని ఆత్మశక్తిని పునరుజ్జీవనం చేయడమే. సంస్కృత భాష ద్వారానే మనం మన పూర్వీకుల లోని శౌర్యపరాక్రమాలను, జ్ఞానతృష్ణను గ్రహించి గొప్ప నాగరికతలతో ఒకటిగా ఏర్పడ్డాము.

సంస్క ృతం-చనిపోయిన భాష, కష్టమైన భాష, హిందూ భాష, ఉద్యోగావకాశాలు లేని భాష లాంటి అపోహలు ఆ భాష చుట్టూ చాలా ఉన్నాయి. కానీ, ప్రస్తుత మారుతున్న సమాజంలో పరిశీలిస్తే మనదేశంలో 16 సంస్కృత విశ్వ విద్యాలయాలు సంస్క ృత మాధ్యమం ద్వారా వివిధ విషయాలను బోధిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఐచ్ఛిక భాషలలో ఒకటిగా, × నుండి ×× తరగతి వరకు సంస్కృత బోధన జరుగుతున్నది. స్టేట్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌బోర్డులలో చాలావరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ‘త్రీ లాంగ్వేజ్‌ ‌ఫార్ములా’లో భాగంగా × , ×× తరగతులలో రెండవ ఐచ్ఛిక భాషగా సంస్కృతాన్ని భోదిస్తున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్ర రెండవ అధికారిక భాషగా సంస్కృతం కొనసాగుతున్నది. కొన్ని పాఠశాలలు నర్సరీ స్థాయి నుండే సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధిస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు దీనిని మాతృ భాషతో పాటు మిశ్రమ కోర్సుగా అందిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో మొత్తం ఐదు కోట్ల మంది విద్యార్థులు సంస్కృతాన్ని అభ్యసిస్తున్నా రని అంచనా. దేశంలో పాఠశాల స్థాయిలో సుమారు 5000 సాంప్రదాయ సంస్కృత పాఠశాలలు, 1000 వేద పాఠశాలలు ఉన్నాయి.

భారతదేశంలో చాలా రాష్ట్రాలలో సంస్కృత మాధ్యమిక విద్యా మండలి లేదా సంస్కృత విద్య డైరెక్టరేట్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఏమీ లేవు. సుమారు 120 సాధారణ విశ్వవిద్యాలయాలు యుజి నుండి పిజి స్థాయిలో సంస్కృతాన్ని అందిస్తు న్నాయి. ఇవే కాకుండా మన దేశంలో 10 సంస్కృత అకాడమీలు, 16 ఓరియం టల్‌ ‌రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్స్, 60‌కి పైగా పీరియాడికల్స్, ‌మ్యాగజైన్స్, ‌సుమారు వంద ఎన్జీఓలు సంస్కృతం ప్రజాదరణ పొందడం కోసం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆల్‌ ఇం‌డియా రేడియో రోజుకు రెండసార్లు సంస్కృత బులెటిన్‌లను ప్రసారం చేస్తున్నది. డిల్లీ దూరదర్శన్‌ ‌రోజుకు రెండు సార్లు సంస్కృత వార్తలను, వారానికి అరగంట ప్రత్యేక బులెటిన్‌ ‌సంస్కృతంలో ప్రసారం చేస్తుంది. దివ్యవాణి అనే సంస్క ృత 24/7 ఇంటర్నెట్‌ ‌రేడియో, వివిధ రకాల ప్రసారాలను పూర్తిగా సంస్కృతంలో ప్రపంచవ్యాప్తంగా 165కి పైగా దేశాలలో అందిస్తున్నది.  కర్ణాటకలోని మత్తూరు లాంటి ఏడూ గ్రామాలూ, మధ్యప్రదేశ్‌లోని ఝిరీ వంటి గ్రామాలు సంస్కృతాన్ని రోజువారీ భాషగా ఉపయోగిస్తాయి. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు సంస్కృతం నేర్చుకుని సంస్కృత కుటుంబాలుగా మారిపోతున్నాయి.

భారత రాజ్యాంగం ప్రకారం సంస్కృతం అధికారిక భాషలలో ఒకటి. దేశంలో సాధార ణంగా మాట్లాడే భాష సంస్కృతం కానప్పటికీ, అన్ని భారతీయ భాషల/మాండలికాల పదజాలం సంస్కృత మూలాల నుండి వచ్చినదే. సంస్కృతం ఒక భాష మాత్రమే కాదు, ప్రాచీన భారతదేశం అభ్యాసాన్ని ప్రతిబింబించే సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ.

సంస్కృతం నేర్చుకోవడంలో ఆచరణాత్మక విషయం ఏమిటంటే, మనసును తార్కికంగా ఆలోచించడానికి శిక్షణ ఇవ్వడం, స్పష్టంగా వ్యక్తీక రించడం, మేధో బలాన్ని అభివృద్ధి చేయడం, పదాల అర్థాలపై తీవ్రమైన అవగాహన కల్పించడం అనే వాటిపై అది ఆధారపడి ఉంటుంది. సంస్కృత ఉచ్చారణలో నాణ్యత, మెదడు పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడమే కాకుండా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడు తుంది. అంతేకాక, సంస్కృత ఉచ్చారణ చైతన్యశక్తిని పెంచుతూ, వ్యక్తిత్వంలో అద్బుతమైన పరివర్తన తీసుకురావడంలో భాష విస్తారమైన శక్తిని కలిగి ఉంటుంది.

ఈ భావన నిజమైన ఆనందానికి దారి తీయడమే కాక హృదయాన్ని, మనస్సును అమరత్వం అనే సంపూర్ణ భావనతో నింపుతుంది. భాషలోని స్వచ్ఛత మనలను ఆకర్షిస్తుంది, ప్రేరేపి స్తుంది. మన జీవితంలోని నిజమైన లక్ష్యాన్ని నిరం తరం గుర్తు చేస్తుంది, మనలోని సత్యాన్ని మనకు స్పృహ కలిగిస్తుంది. సంస్కృతభాష లయ సౌందర్యం, శ్రావ్యత, దాని శబ్ద ప్రకంపనాల స్వచ్ఛత, శబ్ద నాణ్యత గొప్పతనం, మూలశబ్దాల పారదర్శకత, పదజాలం, విషయాల గొప్పతనం ఇవన్నీ సంస్కృత భాషను సమాజంలో గర్వపడేలా చేసాయి.

– డా. సంపదానంద మిశ్రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *