పార్క్ కేంద్రంగా సంస్కృత భాష ప్రచారం.. ”సంస్కృత సన్ డే” పేరుతో మిళన్

కింభో… తమ నామధేయ కిమ్‌…? (నమస్తే… మీ పేరేమిటి? ఎలా వున్నారు?)… ఇలా వారాంతంలో సంస్కృతాన్ని అభ్యాసం చేసే ఓ సమూహం బెంగళూరులోని ఓ పార్క్‌ వేదికగా సమావేశమవుతుంది. ‘‘సంస్కృత్‌ వీకెండ్‌’’ పేరుతో స్థాయి..ఇన్‌ అనే సంస్థ ప్రారంభించింది. ప్రారంభం నుంచే ఈ కార్యక్రమం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. సంస్కృతంలో సంభాషించాలనుకునే పిల్లలు, పెద్దలు బెంగళూరులోని కబ్బన్‌ పార్క్‌కి ఆదివారం ఉదయం 7 గంటల కల్లా చేరుకుంటారు. సంస్కృతాన్ని నేర్చుకోవడంతో పాటు అదే భాషలో సంభాషణ కూడా చేసుకుంటారు. Sthaayi.in అనే సంస్థ 2020`21 లో ఏర్పాటైంది. సంస్కృత భాష ప్రచారం కోసమే ఈ సంస్థ ఆవిర్భవించింది. దీని స్థాపకులు ”సమష్టి గుబ్బి”. ఈయన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వ్యాకరణంలో ఎం.ఏ చేశారు. మరోవైపు హిందీ పాటలు, ఆంగ్ల పాటలను కొన్నింటిని ఎంపిక చేసి, వాటిని సంస్కృతంలోకి మార్చి.. వాటిని సోషల్‌ మీడియాలో పెడుతుంటారు. అలాగే వోల్గ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. కేవలం పార్క్‌లోనే కాకుండా… ఈ సంస్థ సభ్యులు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి, సంస్కృతాన్ని ప్రచారం చేస్తుంటారు. అలాగే సంస్కృత మారథాన్‌’’ కూడా నిర్వహిస్తారు.

ప్రస్తుత సాంకేతిక సమాజంలో ప్రజలు బాగా బిజీ బిజీ వుంటారని, అందుకే సంస్కృతాన్ని వ్యాప్తి చేయడానికి వారాంతమైన ఆదివారాన్ని ఎంచుకొని, పని చేస్తున్నామని తెలిపారు.ఆదివారమైతే అందరికీ కొంత సమయం దొరకుతుందన్నారు. చాలా మంది పాఠశాలల్లో, కళాశాలల్లో సంస్కృత భాష నేర్చుకుంటున్నారు కానీ… సంభాషణ మాత్రం చేయడం లేదని, సంస్కృత భాషలో అందరూ సంభాషించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందులో వైద్యులు, ఇంజినీర్లు, క్రీడాకారులతో పాటు సామాన్యులు కూడా ఇందులో పాల్గొంటున్నారన్నారు. పార్క్‌ వేదికగా కొంత మంది కలిసి సంస్కృతంలో మాట్లాడుతుంటమని, దీనిని ప్రారంభించి 2 నెలలు మాత్రమే అయ్యిందని, కానీ విశేష స్పందన వుందని సమష్టి గబ్బి తెలిపారు.

ఈ పార్క్‌లో ఈ సమూహానికి చెందిన వారందరూ వాకింగ్‌ని పూర్తి చేసుకొని, ఆటలు కూడా సంస్కృతానికి సంబంధించిన ఆటలే ఆడుతుంటారు. ఎలా ఆడాలో కూడా అదే భాషలో చెబుతారు. సంస్కృత పాటల మ్యూజికల్‌ జామ్‌, సంస్కృత టాలెంట్‌ షో కూడా గ్రూపులు గ్రూపులుగా విభజించి, ఆడుకుంటారు. ఓ గ్రూపు కన్నడ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోని సినిమా డైలాగులు చెబుతుంటే.. మరో గ్రూపు దానిని సంస్కృత భాషలోకి అనువాదం చేస్తుంటారు. దాని తర్వాత మిత్ర భోజనం, బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకుంటారు. దీనికి కూడా సంస్కృత బ్రేక్‌ఫాస్ట్‌, సంస్కృత లంచ్‌ అని పేరు కూడా పెట్టుకున్నారు. తమందరి లక్ష్యం సంస్కృతాన్ని ప్రమోట్‌ చేయడమని, సంస్కృతాన్ని వ్యాప్తి చేయడమేనని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *