అక్కల్ కోట్ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్‌కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్‌కోట్ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా పొంగిపోయానని ఆయన తెలిపారు. గురు దత్తాత్రేయ అవతారమైన సద్గురు సమర్థ స్పర్శ కారణంగా అక్కల్‌కోట్ భూమితో సహా భారత దేశం మొత్తం అనేక ప్రాంతాలు అత్యంత పవిత్ర ప్రాంతాలుగా మారిపోయాయని అన్నారు. దీంతో అక్కల్‌కోట్ స్వామి మహిమలు, వ్యాప్తి దేశవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు.
స్వామి మహారాజ్ దేవస్థానం చేస్తున్న ఆధ్యాత్మిక కృషి చాలా అద్భుతంగా వుందని, వటవృక్ష స్వామి దేవస్థానం అధ్యక్షుడు మహేశ్ ఇంగ్లే నాయకత్వంలో దేశం మొత్తం ఆధ్యాత్మిక పరిమళాలు వ్యాపించాయన్నారు. దేశంలో ఆధ్యాత్మికత, సంస్కృతిని ప్రోత్సహించడంలో అక్కల్ కోట్ దేవస్థానం ముందుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సరసంఘ చాలక్ మోహన్ భాగవత్‌కి స్వామి వారి ప్రసాదం, మూర్తి ట్రస్ట్ సభ్యులు అందజేశారు.