సరస్వతీ శిశు మందిరాల్లో అమ్మ నాన్నల పాద పూజ

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల్లో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం జరిగింది. అమ్మ నాన్నలను గౌరవించే అలవాటు చిన్న నాటి నుంచే నేర్పించే యోజన తో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో దీనిని జరుపుతారు. సాధారణంగా ఫిబ్రవరి 14వ తేదీన జరిపించటం ఆనవాయితీ.

పాఠశాలల్లో గణపతి పూజ, కలశ పూజ నిర్వహించి తర్వాత మంత్రోచ్ఛారణల జరిపించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలు కడిగి పసుపు, కుంకుమ రాసి పూలదండలు వేసి పాదాలకు నమస్కరించారు . తల్లిదండ్రులు విద్యార్థులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పిల్లలను దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకున్నారు.

ఈ కార్యక్రమంలో వక్తలు  మాట్లాడుతూ పిల్లలకు ఇలాంటి సంస్కారాలను అందిస్తున్న ఏకైక పాఠశాలలు శ్రీ సరస్వతి శిశు మందిరాలని వివరించారు. అన్ని వర్గాల వారు  కూడా తమ తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు .విద్యతోపాటు చక్కటి సంస్కారాలను నేటి తరానికి అందిస్తున్న సరస్వతి శిశు మందిరాలను, ఆచార్యులను అభినందించారు.

పిల్లలు చక్కగా పాదపూజ కార్యక్రమాన్ని శ్రద్ధతో భక్తితో చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సరస్వతీ శిశు మందిరాలలో చదువుతోపాటు సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పిస్తున్నాయని, ఇది చాలా గొప్ప విషయం అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *