మాకు జ్ఞానదేవత సరస్వతీ మాతే కావాలి!
జ్ఞాన దేవత సరస్వతీ మాత జయంతి సందర్భంగా నిన్న రాజస్థాన్ ప్రాంతంలోని జోధపూర్‌కు దగ్గరలో ఉన్న ఓషియా గ్రామంలోని విద్యార్థులతో జరిగిన సమావేశంలో విద్యార్థులు పై విధంగా మాట్లాడారు. 30 మంది బాలలు (3 నుండి 14 సా.ల వయస్సు గలవారు) ఉన్న వసతి గృహం. అందరూ కరోనా సమయంలో తల్లి తండ్రులను కోల్పోయిన వారే! వీరి కొరకు నాలుగు సంవత్సరాల క్రితం ఒక వసతి గృహం ప్రారంభం అయింది. కరోనా పేరున ప్రకృతి విసిరిన సవాలుకు కొద్దీ మంది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు సమాధానమే ఈ వసతి గృహం. ఈ వసతి గృహంను ఒసియన్ రెడీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. డా.రవి ప్రకాష్ ప్రధాన సంచాలకులు ఆ ప్రధాన కేంద్రాన్ని సందర్శించి, ఆ బాలలకు జ్ఞాన ఋషులు డా.అబ్దులు కలాం, డా.అంబేడ్కర్‌ల జీవిత చరిత్రలు తెలియ చేశాను. వారు నేర్చుకున్న దేశ భక్తి గీతాలను వారు పాడి వినిపించారు.