నిజచరిత్ర చెప్పాలి

హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారం కేవలం విదేశీయుల చేతనే గాక స్వజనుల చేత కూడా అడ్డూఅదుపూ లేకుండా కొనసాగింది. ఈ అబద్ధాల ప్రచారానికి ప్రతిక్రియ చేయటం కేవలం స్వాభిమానం మాత్రమే కాకుండా చరిత్ర నిజాలను బయటకు తీయడానికి అత్యంత అవసరం, వాంఛనీయం కూడా. భారతదేశం మీద దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన విదేశీశక్తులను ఓడిరచి హిందూదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన వీరులను, హిందూ రాష్ట్రాన్ని ఉద్దరించిన వారి పరం పరను, ఆ స్వాతంత్య్ర సంగ్రామాలకు నాయకత్వం వహించిన పరాక్రమ సంపన్నులైన మహాపురుషుల చరిత్రను ఆవిష్కరించటానికి పూనుకోవాలి.

– స్వాతంత్య్ర వీర సావర్కార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *