రొయ్య పొట్టుతో విత్తనాలు…. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ

శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్ారు. వృథాగా పడేసే రొయ్య పొట్టుకు పలు సేంద్రీయ పదార్థాలను కలిపి విత్తనాలుపై పొరలుగా చేసి, నాటడం ద్వారా అధిక దిగుబడి వస్తుందని నిరూపించారు. అంతేకాకుండా చీడపీడల నివారణ, భూసార సంరక్షణతో మొక్కలకు రక్షాకవచంగా మారుతుందని కూడా నిరూపించారు. ఇందుకు హైదరాబాద్ వేదికైంది. రాజేంద్రనగర్ లోని జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రసాద్, పూర్ణ చంద్రికలు ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధనలు చేశారు. ఇలా ఐదేళ్లు పరిశోధనలు చేసి, బయోపాలిమర్ ఆధారిత విత్తనోత్పత్తి విధానాన్ని అభివృద్ధి చేశారు.

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అధికారులు ఈ బయెపాలిమర్ ను ఆవిష్కరించారు. రొయ్య పొట్టును శుద్ధి చేసి, ద్రవంగా మార్చి, దానకి మొక్కలకు మేలు చేసే ట్రైకోడెర్మా, ఇతర సూక్ష్మ పోషకాలు, జీవ సేంద్రీయ పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని విత్తనాలకు పొరలు పొరలుగా వేశారు. వాటిని వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు చేయగా… సత్ఫలితాలు వచ్చాయి. బయోపాలిమర్ ఆధారిత సీడ్ కోటింగ్ విధానానికి బయోపాలిమర్ పేరిట దరఖాస్తు చేసుకోగా… దీనికి పేటెంట్ హక్కులు కూడా లభించాయి. అయితే ఈ బయోపాలిమర్ ను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్ కి చెందిన శ్రీకర్ బయోటెక్, కోల్ కతాకి చెందిన ఎదుకా ఆగ్రోటెక్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *