ఒక్క మహిళ ముందడుగు… ఏకంగా విత్తన బ్యాంకే వచ్చేసి, ఆదర్శంగా నిలిచారు

సాధారణంగా డబ్బులను అప్పు ఇచ్చే బ్యాంకు మనం చూస్తుంటాం. అవసరమైతే అందులో లోన్ తీసుకొని, మన అవసరాలను తీర్చుకుంటాం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే.. విత్తనాల కోసమంటూ ఓ బ్యాంకు వుందని, అక్కడి నుంచి విత్తనాలను తీసుకుంటారని ఎప్పుడైనా విన్నారా? వేరే దేశంలో కాదు.. మన దేశంలోనే. ఎక్కడంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి జిల్లాలోని గౌరా కన్హారి గ్రామంలో ఇలా సాగుతుంది. పుల్జారియా బాయి కెవాటియా… అత్యంత సాధారణమైన గిరిజన మహిళ. స్థానికంగా రైతులు పండించే పంటల్ని సంరక్షించేందుకు ఈమె ఏకంగా ఓ బ్యాంకునే స్థాపించారు. అత్యంత సమర్థంగా నడిపిస్తున్నారు కూడా. ఇది అత్యంత సమర్థవంతంగా నడవడానికి ఆ గ్రామంలోని మహిళలందర్నీ సంఘటితం చేసింది కూడా.

గౌరా కన్హారి గ్రామంలో పంటను ఇంటికి తీసుకెళ్లడానికే ముందే అప్పుగా తీసుకున్నవాటికి రెట్టింపు విత్తనాలను చెల్లించడానికి బ్యాంకు ముందు క్యూలో నిల్చుంటారు. ఈ ప్రాంతం స్థానికంగా పండే పంటలకి, ముఖ్యంగా చిరు ధాన్యాలకు, పప్పుధాన్యాలకు బాగా పేరు గడించింది. అరికెలు, సామలనే ఎక్కువగా తీసుకుంటారు. దాదాపు 52 రకాల చిరు ధాన్యాలను పండిస్తారు. అంతటి అద్భుతమైన ప్రాంతంలో ఓ సారి కాలం వెక్కిరించింది. విత్తనాల కొరత తీవ్రంగా ఏర్పడింది. అసలు విత్తడానికి గింజలే లేని కాలం వచ్చేసింది. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ తోచలేదు. ఎవ్వరిని అడగాలో తెలియలేదు. దీంతో విత్తనాల కోసం తామే ఓ బ్యాంకు పెట్టుకుందామని పుల్జారియా బాయి కెవాటియా తెలిపింది. దీంతో అందరితో సంప్రదించి, ముందుకెళ్లారు.

అయితే.. విత్తన బ్యాంకును నెలకొల్పడానికి పుల్జారియా బాయే ముందు వరుసలో నిల్చుంది. నిజానికి జూన్ జూలై మాసాల్లో విత్తనాలను నాటేస్తారు. సెప్టెంబర్ కల్లా పంట వచ్చేస్తుంది. కానీ ఈ సారి ఇబ్బందులు రాడంతో మహిళలందరూ కలిసి చుట్టు పక్కల ప్రాంతాలన్నీ పర్యటించారు. నాణ్యమైన విత్తనాలను సేకరించారు. వాటిని భద్రపరిచి, ఎవరికైతే అవసరముంటుందో వారికి అప్పుగా ఇచ్చే బాధ్యతను ఆ మహిళ తీసుకుంది. 15 రకాల సామలు సహా 37 రకాల మిల్లెట్ విత్తనాలను రైతులు అప్పుగా తీసుకుంటారు. పంట రాగానే రెట్టింపు విత్తనాలను బ్యాంకులో చెల్లిస్తారని పుల్జారియా బాయి తెలిపింది. ఇంతటి అద్భుతమైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పర్చిన పుల్జారియా బాయి పై ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. సెంట్రల్ ఇండియా గ్రీన్ హబ్ ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *