దేశంలోనే అత్యంత అరుదైన చెట్టు మహబూబ్‌ నగర్‌ లో… ఇది మన పురాణాల్లో కూడా వుంది..

జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వున్న బొటానికల్‌ గార్డెన్‌ అరుదైన రికార్డు నెలకొల్పింది. అక్కడి బొటానికల్‌ గార్డెన్‌ లో అరుదైన సీతా అశోక చెట్టు పుష్పించింది. శాస్త్రీయంగా దీనిని సరాక అశోక అంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగమూ దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. దీని నుంచి అసోకారిస్టమ్‌ అనే మందు తయారు చేస్తారు. మహిళలకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే… ఈ మొక్కను ఆంధ్రప్రదేశ్‌లోని యోగి వేమన యూనివర్శిటీలోని లీడ్‌ బొటానికల్‌ గార్డెన్‌ నుంచి సేకరించి, జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌లో పెంచుతున్నారు. అంతరించిపోతున్న మొక్కల్లో ఈ సీతా అశోక మొక్కలొకటి. తెలంగాణలో కేవలం నల్లమల్ల అడవుల్లోనే పెరుగుతాయి.

 

మన మన ఇళ్లల్లో సంతోష, ఆనందకర వాతావరణం వుండాలంటే ఈ అశోక మొక్కను పెంచుకోవాలన్న ఒక భావన ఈ సమాజంలో బాగా వుంది. దు:ఖాన్ని పోగొట్టే చెట్టు అని కూడా దీనికి పేరు వుంది. ఈ అశోక చెట్టుకి అశోకము, అశోగం, భారతీయ మాసచెట్టు అని అంటారు. దీని ఆకు పెద్దగా, అడ్డంగా వ్యాపించి వుంటుంది. 20 మీటర్ల ఎత్తు వరకు, 7 లేదా 8 కేసరాలతో వుంటుంది. వసంత కాలంలో ఇది పెరగడానికి అత్యుత్తమమైన కాలం. వేసవి కాలంలో పూర్తిగా ఇది నీటి మీదే ఆధారపడి వుంటుంది. వర్షాకాలంలో మాత్రం మధ్యస్తంగా నీరు కావాలి. ఈ చెట్టును ఇళ్లల్లో, తోటలు, కార్యాలయాలు, ల్యాండ్‌ స్కఏప్‌ గా కూడా వాడుతున్నారు.

 

అశోక చెట్టు లక్షణాలిలా వుంటాయి…

ఇది సతత హరితచెట్టు. భారత్‌, మయన్మార్‌, శ్రీలంకలో బాగా పెరుగుతుంటుంది.
ఆకుపచ్చ ఆకులుగా వున్నా… మోదట్లో రాగి ఎరుపు రంగులో వుంటాయి. తర్వాత అవి పరిపక్వం చెందుతున్న క్రమంగా ఆకుపచ్చగా మారుతుంటాయి.
పువ్వులు ఏడాది పొడువునా కనిపించినా, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు అత్యంత వికసించే కాలంగా చెబుతుంటారు.
దీనికి శోకం లేని చెట్టు అని పేరు. ఎందుకంటే ఇది అన్ని రకాల దు:ఖాల నుంచి విముక్తి కల్పిస్తుందన్నది ప్రజల నమ్మకం.

 

పురాణాలలో కూడా దీని ప్రశస్తి వుంది…

రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిన తర్వాత లంకలో అశోక చెట్టు కిందనే వుంచారు. సీతమ్మ వారు ఆశ్రయం పొందింది ఈ చెట్టు కిందనే. అలాగే హనుమంతుల వారు కూడా సీతమ్మను గుర్తించింది ఈ చెట్టు కిందనే. అలాగే కామదేవ అనే దేవుడికి కూడా వీటిని సమర్పిస్తారు. ఇక బుద్ధుడు శాక్యరాణి మాయ దగ్గర అశోక చెట్టు కిందనే జన్మించాడని బౌద్ధ మూలాలు పేర్కొంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *