నియంత నిజాం పాలన నుండి విమోచనం పొందిన రోజు సెప్టెంబర్ 17

 హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో అతిపెద్ద సంస్థానం దీనిలో పదమూడు వరకు ఉపసంస్థానాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతం పూర్తిగా ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేది. సుమారు 70 లక్షల ఎకరాల భూమి జమీందారుల చేతులలో ఉండేది. ఐదున్నర లక్షల ఎకరాల భూమి నిజాం స్వంత ఖర్చులకోసం ఉపయోగించుకునేవాడు దానిని సర్ఫే కాస్ అని పిలిచేవారు. దేశముఖ్ లు జాగిర్దారులు పాయోగాలు పటేల్ పట్వారిలు నిజాం బందు గణాలు ఎవరికి తోచిన విధంగా వారు తెలంగాణ ప్రజలను ప్రాంతాన్ని పితిరి గద్దల లాగా పీక్కొని తిన్నారు. వెట్టిచాకిరి బ్రహ్మాండంగా ఉండేది. ప్రజల నుండి శిస్తు లేదా లంచాలు కానుకల రూపంలో డబ్బులు నేరుగా వసూలు చేసేవారు. గ్రామాలలో ఎలాంటి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ ఉండేది కాదు అంతేకాకుండా కానిగిరి( ప్రైవేట్) పాఠశాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేవారు కాదు. ఊళ్లో ఉన్న పంతులు దగ్గరికి వెళ్లి చాటుగా ఎంతో కొంత చదువు నేర్చుకునేవారు. పాలనలో బోధనలో మాతృభాష స్థానంలో ఉర్దూ తీసుకొచ్చి రుద్దడం విద్యా వ్యవస్థలోకి మతాన్ని జోప్పించడం ఇలాంటి చర్యలతో అనేకమంది ప్రజలకు పాలనా మరియు విద్య దూరమైంది. అందుకోసమే అప్పటి తరంలో ప్రతి గ్రామంలో ఇప్పటికీ నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.
ముస్లింలంతా పాలకులు హిందువులంతా బానిసలు అనే భావజాలాన్ని సమస్థానం మొత్తం వ్యాపింప చేశారు ముస్లింల జనాభాను పెంచడమే ప్రధాన ధ్యేయంగా పనిచేసే సంస్థలు మజ్లీస్ -ఏ-ఇత్తేహదుల్ ముస్లిమీన్, రజాకార్లు, సిద్ధికి దీందారు సంస్థ, కాక్సర్, బెల్ఫాహౌస్ ముఠాలను… తానే స్వయంగా పెంచి పోషించేవాడు. భాంచన్ దొర అనే భావనను అభివృద్ధి చేశాడు అల అనుకుంటే చర్మం ఓలిచేవారు. తబ్లిక్ అంటే మతమార్పిడిలు, కొలువుల కోసం ఉద్యోగాల కోసం బిరుదుల కోసం పదవుల కోసం అధికారం కోసం భయానో నయానో పెద్ద ఎత్తున తబ్లిక్ జరిగేది. వీధులకు నగరాలకు సంస్థలకు ఒకే మతానికి చెందిన పేర్లు పెట్టేవారు. ఇవన్నీ గమనించిన ఇక్కడి ప్రజలలో నిజాం పాలనపై వ్యతిరేకత బాగా పెరిగింది. దీనిలో భాగంగా పత్రికలు, పండుగలు, సత్సంగాలు, సమావేశలు ఊరేగింపులు చివరికి చావులపై కూడా నిషేధాలు విధించాడు. తమ భాష సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబొట్టులపై ఆంక్షలు విధించేసరికి చావో రేవో తెలుసుకోవడానికి ఇక్కడి ప్రజలంతా ఏకమై నిజాం వ్యతిరేక పోరాటాలకు జంగు సైరన్ మోగించారు.
ముస్లింలు హిందువులను పాలించడానికి జన్మించారు అనే “ముస్లిం- ఏకైదార్” ముస్లింల ఆధిపత్యం కొనసాగాలి అనే లక్ష్యంతో ఎంఐఎం స్థాపన జరిగింది. సియాసి కల్మ అంటే అసఫ్జాహీల ఆధిపత్యం ముస్లింల అధిపత్యానికి ప్రతీక అని నూరిపోశారు. అనల్ మాలిక్ అంటే ప్రతి ముస్లిం నేనే రాజు అనే భావజాలాన్ని బాగా నూరిపోశారు దీనితో గ్రామాలలో ఉండే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.దారుల్ ఇస్లాం అంటే హైదరాబాద్ మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చడం అనే ముఖ్య ఉద్దేశంతో 1940లో రజాకారుల దళం ఏర్పడింది . ఆజాద్ హైదరాబాద్ అనేది వీరి నినాదం హిందువుల సంపద దోచుకోవడం కుదరకపోతే కాల్చి బూడిద చేయడమే. దక్కన్ రేడియో తో పాటు పది వరకు ఆంగ్ల మరియు ఉర్దూ దినపత్రికలు వీరి ఆధీనంలోనే ఉండేవి. పటాన్లు అరబ్బులు అఫ్గాన్లు హైదరాబాదు రాష్ట్రమంతా వ్యాపించి సంస్థానం మొత్తం అరాచకాలు సృష్టించారు. దర్గాలు మసీదులు పురాతన కోటలు సారాయిలు వారికి స్థావరంగా మారిపోయినాయి.
కాశీం రజ్వి నాయకుడిగా “దారు- ఉ-సలాం” కేంద్రంగా 56 రాజకారుల కేంద్రాలను నెలకొల్పారు ఈ కేంద్రాలకు రజనీ నుండి ఆదేశాలు అందగానే పట్టణాలలో గ్రామాలలో పల్లెలలో ఎన్నో అగత్యాలకు వారు ఒడిగట్టారు. తల్వార్లతో కోడినో గొర్రెనో కోసినట్లు కుతికలు కోసేవారు. ఒకే వరుసలో నిలబెట్టి అనేక మందిని కాల్చి చంపేశేవారు వారి భర్తల ముందే స్త్రీలను మానభంగాలు చేశారు నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. తల్లిదండ్రుల ముందే పసిపిల్లలను బండకేసి కొట్టి గడ్డివాములలో వేసి దహనం చేసేవారు కోళ్ళను మేకలను గేదెలను ఎత్తుకెళ్లేవారు. బైరాన్ పల్లి, పరకాల, గుండ్రంపల్లి, పాములగుంట, బోరవెల్లి, కూటిగల్లు, అమీర్పేట్ పంజాగుట్ట….. ఇలా అనేక గ్రామాలలో వేలాది మంది ప్రజలను అతి కిరాతకంగా హత మార్చారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలపాలి అని వ్యాసం రాసినందుకు ఇమ్రోజ్ రోజు పత్రిక సంపాదకుడైన షోయబుల్లాఖాన్ ను అతి కిరాతకంగా హత్య చేశారు. జాతీయ జెండా ఎగరవేసిన నేపంతో బత్తిని మొగులయ్య గౌడ్ ను, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య…. ఇలా అనేకమంది పోరాట యోధులను కత్తులతో పొడిచి తుపాకులతో కాల్చి చంపారు.
హైదరాబాద్ సంస్థానంలో నిజాం మరియు తన అనుచరులను ఎదిరించడానికి అనేక సంస్థలు ఇక్కడ ఉద్భవించాయి. అందులో ముఖ్యమైనవి ఆర్య సమాజ్, హిందూ మహాసభ, ఆంధ్ర మహాసభలు. నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ అలుపెరుగని పోరాటాలు చేసింది. తెలంగాణ విమోచన పోరాటంతో ఆర్య సమాజ్ తన కీర్తిని హిమాలయ శిఖరాలకు చేర్చింది. పండిట్ నరేంద్ర, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ రావు పవర్ వందేమాతరం రామచందర్రావు….. లాంటి అనేకమంది నాయకులను ఆర్య సమాజం అందించింది. ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయి స్టేట్ కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులుగా పోరాటం కొనసాగించారు. దాశరథి లాంటి కవులు, వినాయకరావు విద్యాలంకారులాంటి న్యాయవాదులు, వావిలాల వీరభద్ర రావు లాంటి స్వయం సేవకులు అనేకమంది వ్యక్తులు సంస్థలు నిజాం కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేశారు .
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రజా వెల్లువ వచ్చింది. 1947 ఆగస్టు 15 భారత స్వాతంత్రం సిద్ధించగానే ప్రజలలో బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చింది. లక్షలాదిమంది ప్రజలు తమ పనిముట్లనే ఆయుధాలుగా పట్టుకొని నిజాం కు వ్యతిరేకంగా రావడం జరిగింది. ఎన్ని దౌర్జన్యాలు జరిగినా ప్రజలలో చైతన్యం పెరిగింది కానీ తగ్గలేదు. పరిస్థితులు పరిపక్వత సాధించినప్పుడు ప్రజలు ఏ విధంగా కదులుతారు అనేది ఒక అద్భుతమైన విషయం అదే తెలంగాణ విమోచన అనే విధంగా కనబడింది. బ్రిటిష్ వారు ఈ దేశం నుండి వెళ్లిపోయేటప్పుడు స్వదేశీ సంస్థానాలు స్వాతంత్ర రాజ్యాంగ ఉండవచ్చు లేదా భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ కలవచ్చు అని నిబంధన పెట్టి వెళ్లారు. స్వాతంత్ర రాజాలను భారతదేశంలో కలిసిపోవాలి అని సర్దార్ పటేల్ పిలిపిచ్చాడు. దీన్ని లెక్క చేయని నిజాం స్వాతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించాడు. ఆగ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 13 సెప్టెంబర్ 1948 రోజున హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలోను ప్రారంభించాడు. భారత సైన్యం యొక్క పరాక్రమం ముందు తోకముడిచిన నిజాం సైన్యం, మెడలు వంచుకొని లొంగిపోయిన నిజాం రాజు. 430 సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచుకొని తెలంగాణ ప్రజలునియంత నిజాం పాలననుండి విమోచనం పొందారు.
మనం ఒకటి తెలిస్తే విధి మరొకటి తలచింది అనే విధంగా కమ్యూనిస్టుల చర్యలు 1952 వరకు కొనసాగాయి. నిజాం ఆధారంగా ఉస్మానిస్తాన్ కోసం రజాకారులు, పాకిస్తాన్ లోని జిన్నా అండదండలతో ప్రత్యేక ముస్లిం దేశం కావాలని నిజాం కోరుకుంటే, స్టాలిన్ పై నమ్మకంతొ ప్రత్యేక కమ్యూనిస్టు దేశం కావాలని కమ్మునిస్ట్ లు కోరుకున్నారు. ఈ ముగ్గురిని తెలంగాణ ప్రజలు మరియు భవిష్యత్తు చరిత్ర ఎప్పటికీ క్షమించదు అనేది ముమ్మాటికి నిజం. తెలంగాణ ప్రజల పోరాటాన్నిగురుతిస్తూ కేంద్ర హోమ్ శాక జారీచేసిన గజ్జిట్ ను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినం పండుగ వాతావరణం తో జరుపాలి అని తెలంగాణప్రజలు కోరుకుంటున్నారు .
డా.బొప్ప భాస్కర్
(నిజాం వర్సెస్ నిజం పుస్తక రచయిత)
9652332870

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *