మయన్మార్ భూకంప బాధితులకు సేవాభారతి సహాయం

భారీ భూకంపంతో మయన్మార్‌ అల్లాడిపోతుంది. అక్కడి ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. మయన్మార్‌లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 2 వేల 700 దాటింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి భారత్‌ “ఆపరేషన్ బ్రహ్మ” పేరుతో సాయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 625 మెట్రిక్‌ టన్నుల సహాయక సామగ్రిని భారత్‌ అందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ సేవా సమితి సేవా భారతి , ఫౌండేషన్‌ కార్యకర్తలు తమ వంతు సహకారాన్ని అందించారు.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సేవా ఇంటర్నేషనల్ న్యూఢిల్లీ వారి పిలుపు మేరకు వివేకానంద మెడికల్ ట్రస్ట్ మరియు సేవాభారతి సభ్యులు సుమారు 8 లక్షల రూపాయల విలువైన ఔషదాలు, మందులను కొని పంపించారు. సహాయం కోసం పిలుపునిచ్చిన 8 గంటలలో ఈ టాస్క్ పూర్తి చేసి పంపించడం విశేషం. ఈ సామాగ్రితో ఉన్న ఓడ 31.3.25 న విశాఖ నుండి బయలుదేరింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *