సేవా భారతి, పళవంగడి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘‘ఉచిత డయాలసిస్ సెంటర్’’

ఆర్థికంగా వెనుకబడిన కిడ్నీ రోగుల చికిత్స నిమిత్తం సేవా భారతి, మద్రాస్ రెజిమెంట్ నిర్వహణలో నడుస్తున్న పళవంగడి శ్రీ మహాగణపతి ఆలయ ట్రస్ట్ సంయుక్తంగా ఉచిత డయాలసిస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. తిరువనంతపురంలోని ప్రణవం భవనంలో పళవంగడి శ్రీ మహాగణపతి డయాలసిస్ సెంటర్” పేరుతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ ప్రారంభించారు. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ అడ్వకేట్ వి.వి. రాజేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేరళలో పెరిగిపోతున్న కిడ్నీ సంబంధిత వ్యాధుల భారాన్ని మోయలేని పేదలు ఎందరో మంది వున్నారు. వీరికి ఉచిత డయాలసిస్ చికిత్స అందించడానికి ఈ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సేవా భారతి ఆఫీస్ బేరర్లు, పళవంగడి గణపతి ఆలయ ట్రస్ట్ సభ్యులు, మాజీ సైనికులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కేరళలో సేవా భారతి ఆధ్వర్యంలో ఇది రెండో ఉచిత డయాలసిస్ కేంద్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *