హిందూ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అమెరికాలో సేవా దీపావళి
అమెరికాలో హిందూ స్వయంసేవక సంఘ్ దీపావళి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. దీపావళి ఉత్సవాన్ని పురస్కరించుకొని హిందూ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు పలు ప్రదేశాలలో సేవా దివాళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాజంలో సంపన్న కుటుంబాల నుండి మరియు సాధారణ కుటుంబాల నుండి అనేక నిత్యావసర వస్తువులను సేకరించారు. సేకరించిన మొత్తం వస్తువులను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చారు. తద్వారా అనేక వందల దిగువ తరగతి కుటుంబాలకు ఆహారాన్ని పంచిపెట్టారు. డేటా నగరంలో కలెక్ట్ చేసిన 560 పౌండ్ల ఆహారాన్ని ఎన్జీవో కి తరలించారు. అక్కడ హిందూ స్వయంసేవక్ సంఘ నగర కార్యవాహ కాకాని శ్రీరామ్ ఈ బాధ్యతను చూసుకున్నారు.