కరోనా రెండో దశలో 466 మందికి సేవాభారతి ఉచిత చికిత్స

కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ‌సేవాభారతి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా కరోనా లక్షణాలున్న వారికి అండగా నిలిచి.. ఉచిత వైద్య సేవలు అందించింది. హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఐసోలేషన్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి కరోనా బాధితులకు వైద్య సేవలను అందించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ఎత్తేయడంతో అక్కడ సేవలను ముగించారు. ఏప్రిల్‌ 27‌న అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్‌ ‌పాఠశాల విశాలమైన ప్రాంగణంలో 6 గురు వైద్యులు, 8మంది నర్సులు, 8మంది వార్డు బాయ్స్‌తో ఐసోలేషన్‌ ‌కేంద్రాన్ని ప్రారంభించింది. అలాగే సేవాభారతి హెల్ప్‌లైన్‌ ‌సెంటర్‌లో ముగ్గురు, రిసెప్షన్‌లో నలుగురు, ఒక సూపరింటెండెంట్‌, ఒక అంబులెన్స్, ‌డ్రైవర్‌ ఒకరు, 14 మంది ఇతర సిబ్బందితో ఐసోలేషన్‌ ‌సెంటర్‌లో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సేవాభారతి కార్యకర్తలు నిరంతర సేవలో ఉన్నారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 466 మంది చికిత్సపొంది కోలుకున్నారు. 14 రోజుల పాటు వారికి రోజూ ఉదయం అల్పాహారం, టీ, ఫ్రూట్స్, ‌భోజనం, డ్రై ఫ్రూట్స్, ‌జ్యూస్‌ అం‌దించారు. ప్రతి రోజు ఉదయం యోగ, ప్రాణాయమంతో పాటు మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తొందరగా కొలుకున్నామని ఇక్కడ సేవలు పొందిన వారు తమ అనుభవాన్ని పంచుకున్నారు.

ఆదివారం జరిగిన ఈ ముగింపు కార్య క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రాంత ప్రచారక్‌ ‌దేవేందర్‌, ‌క్షేత్ర సేవాప్రముఖ్‌ ‌చంద్రశేఖర్‌ ‌జీ, డాక్టర్‌ ‌వేదప్రకాశ్‌ ‌జీ, డాక్టర్‌ ‌మారుతి శర్మ జీ, డాక్టర్‌ ‌పృత్తు, డాక్టర్‌ ‌రాజు, డాక్టర్‌ ‌శిల్పా రెడ్డి, డాక్టర్‌ ‌ప్రమోద్‌ ‌జీ, సికింద్రాబాద్‌ ‌విభాగ్‌ ‌ప్రచారక్‌ ‌ముడుపు యాదిరెడ్డిజీ, ప్రాంత సేవాప్రముఖ్‌ ‌వాసుజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *