చేయి చేయి కలిపి చేయూతనివ్వాలి..
చేప్రతి మనిషికి ఎదొక సమయంలో డబ్బు లేక పోవడంవల్ల ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. అత్యవసరమైన సమయంలో అప్పులు చేసి అవి తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొం టున్న పేద, మధ్య తరగతులవారికి చేయూతనిచ్చే వారికి అండగా నిలుస్తున్న సేవా భారతి స్వయం సహాయక సంఘాల గురించి తెలుసుకుందాం.
తమిళనాడులోని కడపేరి అనే గ్రామానికి చెందిన సీత అనే మహిళ 20 ఏళ్ల క్రితం కుటుంబం అప్పుల కోసం తన తండ్రి భూమిని వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టారు. ఈ రోజు వడ్డీతో సహా మొత్తం రూ.60,000 చెల్లించి ఆ భూమిని తిరిగి సొంతం తమ చేసుకున్నారు. ‘‘శ్రీ మధురమ్మన్’’ స్వయం సహాయక సంఘంలో సోదరీమణులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాకపోతే ఈ అప్పు ఎప్పటికీ తీరేది కాదు.
తమిళనాడులోని వెనుకబడిన వనవాసి గ్రామాల ప్రజల సాధికారత కోసం 20 సంవత్సరాల క్రితం సేవాభారతి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. నేడు తమిళనాడు వ్యాప్తంగా సేవా భారతి ద్వారా వారి సంఖ్య 4000 వేలకు పైగా చేరుకుంది. ఆర్థిక సాధికారతతో పాటు, ఈ స్వయం సహాయక బృందాలుః కూడా సమాజంలో పరస్పరం సహకరించుకోవాలనే భావనను పెంపొంది స్తున్నాయి. అంచుకన్నడరాడ్ గ్రామానికి చెందిన రాజు.. ఈ గ్రూప్ లో చేరకపోతే బహుశా ఈ రోజు జీవించి ఉండేవాడు కాదు. కొన్నేళ్ల క్రితం అతనికి గుండెపోటు వచ్చి వెంటనే ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు, అతని కూతురికి పదిమంది గ్రూపు సభ్యులు డబ్బు ఇచ్చారు. మరోవైపు, తాడిక్కరంకోణం గ్రామానికి చెందిన ఒక వితంతువు ఇల్లు ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. అప్పుడు కూడా గ్రూప్‌లో సోదరీమణు లందరూ ఇంటికి అవసరమైన సామగ్రిని సేకరించి ఆ వృద్ధ తల్లి సహాయం కోసం ఒక పక్కా ఇల్లు కూడా నిర్మించారు.
భారతదేశం అంతటా ఇటువంటి ఃస్వయం సహాయక బృందాలః ఏర్పాటు కోసం ఒకచోట నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సంఘ ప్రచారక్ సుందర్ లక్ష్మణ్‌జీ ఇలా అన్నారు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిర్పరప్పు గ్రామంలో వెనుకబడిన కులాల మహిళలను సమూహం నుండి తొలగించాలని కుల పంచాయతీ ఆదేశించినప్పుడు, ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి మహిళలు నిరాకరించారు. సమూహంలోని సభ్యులు కుల పంచాయితీతో గొడవ కూడా వెనుకాడలేదు. అటవీ ప్రాంతాల్లో వ్యాపించిన వడ్డీవ్యాపారుల దోపిడీకి, కుల వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పిన ఈ స్వయం సహాయక సంఘాలు మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికీ వెనుకంజ వేయలేదు. తట్టికెరె గ్రామం నుంచి మద్యం కాంట్రాక్టును తొలగించాలని తండాకు చెందిన మహిళలు కలెక్టర్ వద్దకు వెళ్లి కాంట్రాక్ట్‌ను తొలగించేవరకు పోరాటం చేశారు. అదేవిధంగా మురుతంకోడ్ గ్రామంలో అక్రమ మద్యం తయారీ కర్మాగారాన్ని మూసివేసి గ్రూపు సభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ ఆయుర్వేద ఔషధం పేరుతో అరిష్టానం అనే కల్తీ మద్యం తయారీ వ్యాపారం సాగుతోంది. అది తాగి చాలా మంది చనిపోయారు కూడా. గ్రూప్ సభ్యులు న్యాయ పోరాటం చేసి ఈ ఫ్యాక్టరీ లైసెన్స్‌ను రద్దు చేయించారు.
మానవ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ఆధునిక యుగంలో, ఈ స్వయం సహాయక బృందాలుః మానవ సహకారం, సోదరభావానికి కొత్త ఉదాహరణగా ఉద్భవించాయి. తమిళనాడు లోని నాగర్‌కోయిల్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో, భరత్కాళి 23 ఏళ్ల వితంతువు కుమార్తె శాంతి పునర్వివాహాన్ని బృందం సభ్యులు దగ్గరుండి చేయించారు. మరొక గ్రామంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యవసాయ కూలీ మరణించడంతో, బృందం సభ్యులు అంత్యక్రియల ఖర్చులు సమకూర్చ డమే కాకుండా అనాథలైన తన కూతుళ్లు అనిత, కళ పెళ్లి చేసుకునే వరకు అన్ని విధాలా సాయం చేశారు.