సంఘ్ వ్యక్తులు ప్రాచుర్యం, ప్రతిష్ఠల కోసం పాకులాడలేదు : రాం మాధవ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా బెంగళూరులో Shakha to Nation” పుస్తకావిష్కరణ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు వారణాసి రాంమాధవ్, జ్ఞానశ్రీ కులకర్ణి హాజరయ్యారు. ఈ పుస్తకానికి వీరిద్దరు సంపాదకులు కూడా.

ఈ పుస్తకంలో సంఘ్ స్థాపన 1925 నుంచి 2025 వరకూ ఆరెస్సెస్ ప్రముఖుల ప్రసంగాలు, ఇతర వివరాలు సంకలనంగా వచ్చాయి. అలాగేసంఘ్ ప్రయాణంలో 30 ప్రముఖమైన ప్రసంగాలు కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే ఆద్య సర సంఘచాలక్ హెడ్గేవార్, రెండో సర సంఘచాలక్ గోళ్వాల్కర్, ప్రస్తుత సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కి సంబంధించిన ముఖ్యమైన ప్రసంగాలు వున్నాయి. అలాగే ఇతర జ్యేష్ఠ ప్రచారకుల ప్రసంగాలు కూడా సంకలనం చేయబడ్డాయి.

ఈ సందర్భంగా రాం మాధవ్ మాట్లాడుతూ దేశానికి వంద సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలు చేస్తూ, సంఘ్ ఓ మైలు రాయిని చేరుకుందని, ఇలాంటి గొప్ప చారిత్రక సమయంలో గొప్ప వ్యక్తుల ప్రసంగాలను పుస్తకం రూపంలో చేయడం అనేది ఓ గొప్ప అవకాశమని అన్నారు. ఈ పుస్తకం ద్వారా సంఘ్ స్ఫూర్తి, సంకల్పం, ఎజెండాను దేశం, ప్రపంచం మొత్తం అర్థం చేసుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘ్ లో చురుగ్గా పాల్గొనని వ్యక్తులు, అంటే సామాన్యులు కూడా ఈ పుస్తకం ద్వారా సంఘ్ ను, సంఘ్ సారాంశాన్ని ఇట్టే గ్రహించగలరని పేర్కొన్నారు.

ram madhav2
సంఘ్ సందేశాన్ని, జాతి నిర్మాణానికి సంఘ్ చేసి సేవలను ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రజలకు తెలియజేయడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశమని రాం మాధవ్ వివరించారు. సంఘ్ జ్యేష్ఠ కార్యకర్తల ప్రసంగాలన్నీ దేశ సేవ, నాగరికత, హిందూ సమాజ సంఘటన, హిందూ సంస్కృతిని వికసింపజేయడం అన్న విశాలమైన దృక్పథాల గురించే చెప్పారని, ఇది కేవలం ఓ సంస్థ నిర్మాణం గురించే కాదని, దానికి మించిన విషయ పరిజ్ఞానం వుందన్నారు.

సంఘ్, సంఘ్ లోని వ్యక్తులు సంఘ్ విస్తరణ, ప్రాచుర్యం, పేరు కోసం ప్రాకులాడటం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, కేవలం దేశ నిర్మాణం, వ్యక్తి నిర్మాణం పైనే చర్చించారని రాం మాధవ్ నొక్కి చెప్పారు.స్వయంసేవకులు మాత్రమే ప్రాచీన జ్ఞానం, జ్ఞానం మరియు భారతీయ విలువలను ప్రసారం చేసేవారని, వ్యక్తిగత కాంక్షలు, ఆశయాలు కాకుండా దేశమే ప్రథమ ప్రాధాన్యంగా చేస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *