సంతానోత్పత్తి సమస్య కాదు.. మతమార్పిళ్లే సమస్య : షామిక రవి

జనాభాలో మతపరమైన మార్పులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమిక రవి కీలక ప్రకటన చేశారు. సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం వల్ల జనాభాలో మార్పులు రావడం లేదని, బలవంత మతమార్పిడులే దీనికి ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టారు. 2001 వరకు అరుణాచల్ ప్రదేశ్ లో బౌద్ధుల ప్రాబల్యం వుండేదని, కానీ 2011 వచ్చే సరికి క్రైస్తవ ప్రాబల్యం పెరిగిపోయిందన్నారు. మతపరమైన మార్పులకు సంతానోత్పత్తికి మించి, మత మార్పిళ్ల సమస్యే కారణమని అన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతానోత్పత్తి రేటు, జనాభా సమస్యలపై మాట్లాడారు. వివిధ మతాలు వేర్వేరు సంతానోత్పత్తి రేట్లున్నాయని, కానీ.. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందన్నారు. లెక్కల రూపంలో చూసుకుంటే నిజం కానీ… క్షేత్ర స్థాయిలో వున్న విషయాలకు, దీనికి తేడా ఏమీ లేదన్నారు. ఎందుకంటే ఒకే ప్రదేశంలో వున్న జనసంఖ్య గురించే నిజమైన ఆందోళన అని ఆమే పేర్కన్నారు.

ఉదాహరణకు పశ్చిమ ఐరోపాలోని అనేక దేశాలలో మైనారిటీ సంఖ్య వేగంగా పెరిగిందని, కానీ… ఇది కేవలం సంతానోత్పత్తి రేటు కారణంగానే సాధ్యం కాదన్నారు. దీనికి మతమార్పిళ్లే ప్రధాన కారణమని విశ్లేషించారు. భారత్ కూడా పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల లాంటిదని, నిజానికి మైనారిటీల జనాభా నిరంతరం పెరుగుతోందన్నారు. అయితే ప్రపంచంలో మెజారిటీ ప్రజలు తగ్గిపోతూ, మైనారిటీలు పెరుగుతున్న ఏకైక దేశం మనదేనన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *