ఘనంగా జరిగిన శివభారతం పుస్తకావిష్కరణ సభ

ఛత్రపతి శివాజీ గురించి అనేకమంది అనేక పుస్తకాలు ఉన్నాయి. విదేశాస్తులు కూడా అనేక విషయాలు వ్రాసారు. కానీ అవన్నీ ఆయన జీవితాన్ని గురించి వివరాలు ఇస్తే శివభారతం మాత్రం శివాజీ జీవితపు స్ఫూర్తిని, ప్రేరణను మన అనుభూతికి తెస్తుంది. అది ఈ కావ్యపు ప్రత్యేకత’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ కార్యకారిణి సదశ్యులు శ్రీ రామ్‌ మాధవ్‌ అన్నారు. లోక కళ్యానాన్ని సాధించడం కార్యపు లక్ష్యమని దానిని శివభారతం కార్యం పూర్తిగా నెరవేర్చిందని అభిప్రాయపడ్డారు. భాగ్యనగర్‌ కూకట్‌ పల్లిలోని పిఏంఆర్‌ పాఠశాల ఆడిటోరియమ్‌ లో జరిగిన ‘శివభారతం’ కావ్య పునర్ముద్రణ ప్రతిని ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు.

తరతరాలను ప్రభావితం చేసే శక్తి సాహిత్యానికి ఉంటుందని, శ్రీశ్రీ సాహిత్యం కూడా అనేకమందిని కదిలించిందని, కానీ అది సామాజిక ప్రయోజనాన్ని, యువతరానికి మార్గనిర్దేశనాన్ని చేయలేకపోయింది. అయితే శివభారతం ఆ పని చక్కగా నెరవేర్చిందని రామ్‌ మాధవ్‌ అన్నారు.             ఇటువంటి గ్రంథాన్ని పునర్‌ ముద్రించి ప్రజల మధ్యకు మరోసారి తెచ్చిన సంవిత్‌ ప్రకాశన్‌, గ్లోబల్‌ ఇల్యూమైన్‌ సంస్థలు ప్రశంసాపాత్రమైనవని ఆయన అభినందించారు.

అంతకు ముందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌.వి. సుబ్రమణ్యం మాట్లాడుతూ స్వాతంత్య్రం ఏమిటి? ఎందుకు? అనే విషయాల్లో స్పష్టత, ఏకాభిప్రాయం లోపించడం వల్లనే గత 70 ఏళ్లుగా మన దేశం ఒక అడుగు ముందుకు వెళితే నాలుగు అడుగులు వెనుకకు వేస్తున్నదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే సరైన దిశలో కదలి ఉంటే నేడు అనుభవిస్తున్న నష్టాన్ని నివారించగలిగే వారమని ఆయన అభిప్రాయపడ్డారు. శివాజీ మహరాజ్‌ అనుసరించిన విదేశాంగ, వ్యవసాయ, ఆర్ధిక విధానాలు నేటికీ ఉపయోగ కరమని అన్నారు. శివభారతం వంటి కావ్యాలను విద్యాలయాల్లో విద్యార్థులకు చెపితే ఎంతో ఉపయోగమని అన్నారు.

కార్యక్రమంలో మరొక ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్ర కార్యదర్శి శ్రీ రఘురామయ్య స్ఫూర్తికేంద్ర నిర్మాణాన్ని వివరించారు. అందరూ స్ఫూర్తి కేంద్రాన్ని తప్పక సందర్శించి ప్రేరణ పొందాలని ఆహ్వానించారు.

గ్లోబల్‌ ఇల్యూమైన్‌ సంస్థాపక సభ్యులు శ్రీ సంతోష్‌ శివభారత పునర్‌ ముద్రణ గురించి వివరించారు. డా. కె.కె.వి. శర్మ శివభారతం పుస్తక పరిచయం చేశారు.చిన్నారులు ఆలపించిన  శివభారతం కావ్యంలోని పద్యాలు సభికులందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *