సిద్ధి వినాయక దేవాలయం హిందువులది : ట్రస్ట్ కీలక ప్రకటన
ముంబైలోని అత్యంత ప్రసిద్థమైన సిద్ధి వినాయక దేవాలయాన్ని వక్ఫ్ దావా వేయడంతో తీవ్ర వివాదం మొదలైంది. దీనిపై రాజకీయ వివాదం కూడా ప్రారంభమైంది.దీంతో దేవాలయం ట్రస్టీ తీవ్రంగా స్పందించింది. సిద్ధి వినాయక దేవాలయాన్ని ఎవ్వరూ క్లైయిమ్ చేయలేరని సొసైటీ కోశాధికారి పవన్ త్రిపాఠి తేల్చి చెప్పారు. ఈ దేవాలయం విఘ్నేశ్వరుడిదని, భక్తులదని, ఇది ఎప్పటికీ అలాగే వుంటుందని స్పష్టం చేశారు.
అలాగే ఈ దేవాలయం కేవలం ముంబైకి సంబంధించిన దేవాలయమే కాదని, ప్రపంచంలోని హిందువులందరి శ్రద్ధా కేంద్రమని పేర్కొన్నారు. సిద్ధి వినాయక మందిరం మహారాష్ట్ర అలాగే ముంబై గర్వానికి సంబంధించిన విషయమని, దీనిని ఎవ్వరూ క్లెయిమ్ చేయలేరన్నారు. సిద్ధి వినాయక దేవాలయం భారత దేశంలోనే హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయం. అనేక కోట్ల మంది భక్తులను ఆకర్షిస్తూనే వుంటుంది.
మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ తో సంబంధమున్న చారిత్రక హిందూ ప్రదేశాలు, కోటలపై కూడా వక్ఫ్ క్లైయిమ్ చేయడంతో హిందువులలో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల, మహారాష్ట్రలోని విశాల్‌గడ్ కోటపై వక్ఫ్ బోర్డు యాజమాన్యం క్లెయిమ్ చేసినట్లు వార్తలు వచ్చాయి, ఇది సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన చారిత్రక ప్రదేశం. అదేవిధంగా, మధ్యప్రదేశ్‌లోని కనీఫ్‌నాథ్ ఆలయం మరియు చుట్టుపక్కల 40 ఎకరాల భూమిని కూడా బోర్డు యాజమాన్యం ప్రకటించింది.