ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి ప్రయత్నంలో సింగరేణి… ఓపెన్‌ కాస్ట్ గనుల నుండి జల విద్యుత్ ఉత్పత్తి యోచన

విద్యుత్తు విషయంలో సింగరేణి  యాజమాన్యం కొత్త పద్ధతిని అవలంబించాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు సౌర  విద్యుత్తును ఎక్కువగా వాడుతూ వస్తోంది . కానీ.. సింగరేణిలో రాత్రి వేళల్లో జల విద్యుదుత్పత్తి చేపట్టే దిశగా కసరత్తు చేసవ్తంది. ఉపరితల గనుల్లో వెలువడే జలాలను వృథా పోనివ్వకుండా, వాటిని సద్వినియోగం చేసేందుకు  ఓ ప్లాన్‌ వేసింది . ఉపరితల గనుల్లో వెలువడే జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచన సరికొత్త ప్రయోగమని ససంగరేణి అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన అంచనాలను అధికారులు ససద్ధం చేస్తున్నారు . జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం గనక సాధ్యమైతే … దానికయ్యే వ్యయం, లాభం, నష్టలను అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఈ పనిని టాటా కన్సుల్తేన్సి కి   అప్పగించారు. టాటా న్సుల్తేన్సి జలవిద్యుత్తు ప్లాంటు వ్యయం, ఉత్పత్తి సామమర్థ్యంపై అంచనాలను రూపొందించి, సింగరేణి యాజమాన్యానికి సమర్పిస్తుంది . అయితే దీనికి సంబంధించిన అధ్యయనానికి ఇల్లెందులోని ఓపెన్‌ కాస్ట్ ని  ఎంపిక చేసుకుంది.

ఇల్లెందు ఏరియాలోని జవహర్‌ ఓపెన్‌ కాస్ట్ గనిని టాటా కన్సెల్టెన్సీ ఎంపిక చేసుకుంది. ఇక్కడి మట్టిగుట్టపై నీటి నిల్వకు సిమెంట్ తో  జలాశయాన్ని నిర్మిస్టారు . దానిని గనిలోని జలాలు సౌర విద్యుత్తు సాయంతో  పగటి సమయంలోనే నింపేస్తారు . ఇలా రోజంతా మట్టిగుట్టపైకి తరలించే జలాలను తిరిగి గనిలోకి వదులుతారు. రాత్రి సమయంలో జల విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇలా వచ్చిన నీటిని సింగరేణి అవసరాలకు, రాత్రి సమయాల్లో వాడుకోవాలన్నది సింగరేణి ప్లాన్‌. ఈ ప్రాజెక్టు గనక విజయవంతమైతే … రాష్ట్రంలోని అన్ని ఓపెన్‌ కాస్ట్ గనుల్లో నిర్మిస్తారు. మరోవైపు ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాత్రి వేళల్లో వినియోగించే విద్యుత్తును తక్కువ వ్యయానికి అలాగే ససంగరేణి స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *