అమ్రాబాద్ అభయారణ్యంలో సింగిల్ యూజ్ ప్టాస్టిక్ నిషేధం
అమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యంలో సింగిల్ యూజ్ ప్టాస్టిక్‌ను నిషేధించారు. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమలులో వుంటుందని అటవీ శాఖ ప్రకటించింది. సింగిల్ యూజ్ ప్టాస్టిక్ నిషేధం విషయంలో పైలట్ ప్రాజెక్టుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు ఎంచుకున్నామని, మొదట ఇక్కడ అమలు చేశాక… దశల వారీగా ఇతర అభయారణ్యాల్లోనూ అమలు చేస్తామని అటవీ శాఖ తెలిపింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్` శ్రీశైలం మార్గంలోని మన్ననూరు నుంచి దోమల పెంట వరకూ ఆమ్రాబాద్ అభయారణ్యం పరిధిలోకి వస్తుంది.
ఈ మార్గం గుండా ప్రయాణికులు ప్రతి రోజూ ప్రయాణిస్తుంటారు. దీని కారణంగా ప్టాస్టిక్ బాటిళ్లు, ప్టాస్టిక్ బ్యాగులు, ఇతర పదార్థాలను రోడ్ల వెంటనే పారేస్తున్నారు. దీంతో వన్య ప్రాణుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అటవీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దీనిన ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేధ నిర్ణయంతో వాటికి బదులుగా గాజు సీసాల్లో నీటిని అమ్మాలని, కాగితం, వస్త్రం, జనపనార సంచులు వాటిల్లో వేటినైనా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.