అజ్ఞేభ్యో గ్రంథినః శ్రేష్టా
గ్రంథిభ్యో ధారిణో వరాః
ధారిభ్యో జ్ఞానినః శ్రేష్టా
జ్ఞానిభ్యో వ్యవసాయినః
భావం : వేదాది విద్యల్ని గ్రంథం చూసి నేర్చుకునేవారు, వారికంటే కంఠస్థం చేసిన వారు, వారికంటే అర్థంతెలిసి చదివేవారు, వారికంటే వాటిని ఆచరణలో పెట్టేవారు శ్రేష్టులు.