సోషల్‌ మీడియా హిందూఫోబియా వల్ల హింస: తాజా పరిశోధనలో వెల్లడి

సోషల్‌ మీడియా, తదితర మెసేజింగ్‌ ప్లాట్‌ ఫామ్‌లలో హిందూ ఫోబియా వృద్ధి చెందుతున్న వైనాన్ని అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్శిటీ- న్యూ బ్రున్స్‌విక్‌కు చెందిన నెటవర్క్‌ కంటేజియన్‌ ల్యాబ్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు”Anti-Hindu Disinformation: A Case Study of Hinduphobia on Social Media” (హిందుత్వానికి వ్యతిరేకంగా సమాచారం: సోషల్‌ మీడియాలో హిందూఫోబియాపై ఒక కేస్‌ స్టడీ) పేరిట ఒక పరిశోధనా పత్రాన్ని వారు వెలువరించారు.

మెసేజింగ్‌ సర్వీస్‌ టెలిగ్రామ్‌, ఇతర చోట్ల తీవ్రవాద ఇస్లామిస్ట్‌ వెబ్‌ నెట్‌వర్క్‌లలో హిందువుల తాలూకు మారణహోమ పెపే మీమ్‌లను విస్తృతంగా షేర్‌ చేస్తున్న వైనాన్ని సదరు పరిశోధనా పత్రం వివరించింది.

తమ పరిశోధనలో భాగంగా వారు కృత్రిమ మేధస్సును (Artificial Intelligence) ఉపయోగించారు. పరిశోధకులు 10 లక్షల ట్వీట్‌లను విశ్లేషించారు. విశ్లేషణకు లోబడి ఇరాన్‌కు చెందిన ట్రోల్స్‌ భారత్‌లో మైనారిటీలపై హిందువులు మారణ హోమానికి పాల్పడుతున్నా యని ఆరోపించాయి. తమ ఆరోపణకు బలం చేకూర్చే దిశగా హిందూ వ్యతిరేక విభజన పద్ధతులకు ఆజ్యం పోసేలా ఆ ట్రోల్స్‌ ఉన్నాయని పరిశోధనా పత్రం పేర్కొంది.

‘‘అంతగా గుర్తింపునకు నోచుకొని ఈ అంశం పట్ల అవగాహన కల్పించే అవకాశాన్ని అందిపుచ్చు కోవడాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనమిక్స్‌, క్రిటికల్‌ ఇంటెలిజెన్స్‌ స్టడీస్‌లో రట్జర్స్‌ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్‌, విశ్లేషక విద్యార్థి ప్రసిద్ధ సుధాకర్‌ తెలిపారు. డేటాను సేకరించి, విశ్లేషించడానికి ఉద్దేశించిన న్యూజెర్సీ గవర్నర్స్‌ STEM స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా హైస్కూల్‌ విద్యార్థులతో కలిసి సుధాకర్‌ పనిచేశారు.

‘‘ద్వేషపూరిత సందేశాలను ఎలా గుర్తించాలనే దానిపై హిందూ యువతకు అవగాహన కల్పించడం, వస్తున్న బెదిరింపుల కోసం సిద్ధం చేయడం మరియు ప్రతిస్పందించడంలో సహాయ పడటంలో ఇది ఒక కీలకమైన తొలి అడుగు’’ అని NCRIలోని చీఫ్‌ డేటా సైంటిస్ట్‌ మరియు మిల్లర్‌ సెంటర్‌లోని సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, పరిశోధనకు దిశానిర్దేశం చేసిన జోయెల్‌ ఫింకెల్‌స్టెయిన్‌ అన్నారు.

ముఖ్యంగా భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు, ఇటీవల భారతీయ దుకాణదారుని శిరచ్ఛేదం చేసిన నేపథ్యంలో జూలై మాసంలో హిందూ ఫోబిక్‌ కోడ్‌ పదాలు మరియు మీమ్‌ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా హింసకు ఆజ్యం పోస్తుందని అని తెలిపారు.

‘‘దురదృష్టవశాత్తూ.. మతోన్మాదం, హింసను చవిచూడటం హిందువులకు కొత్తేమీ కాదు’’ అని రట్జర్స్‌ యూనివర్శిటీ-న్యూ బ్రున్స్‌విక్‌లోని మిల్లర్‌ సెంటర్‌ మరియు ఈగల్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ రెండిరటికి డైరెక్టర్‌ జాన్‌ జె. ఫార్మర్‌ జూనియర్‌ అన్నారు.

‘‘సోషల్‌ మీడియాలో విద్వేష పూరితమైన మెస్సేజ్‌లు షేర్‌ అవు తుండటం కొత్తగా చోటుచేసుకుంటున్న పరిణామం. మా పరిశోధన తొలి దశ విద్వేషపూరిత మెస్సేజ్‌ల తాలూకు తీవ్రత, బాహ్య ప్రపంచంలో పెచ్చరిల్లుతున్న హింసాత్మక చర్యల మధ్య సహసంబంధాన్ని ప్రదర్శించిందని తెలిపారు.

‘‘మా ఈ నివేదిక విద్వేషపూరిత మెస్సేజ్‌లు బాహ్య ప్రపంచంలో హింసాత్మక చర్యలకు దారి తీయకమునుపే ఒక ముందస్తు హెచ్చరికగా పని చేస్తుందని ఆకాంక్షిస్తున్నాము’’ అని   మిల్లర్‌ సెంటర్‌ రీసెర్చ్‌ ఫెలో డెన్వర్‌ రిగ్లెమాన్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *