భాగ్యనగర్‌లో సంఘ శిక్షావర్గలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రథమ, ద్వితీయ శిక్షావర్గ మే 15 నుండి జూన్ 4 వరకు భాగ్యనగర్‌లోని ఘట్‌కేసరిలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రంలో జరిగాయి. ప్రథమ వర్ష శిక్షావర్గలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా 302 స్వయంసేవకులు పాల్గొన్నారు. ద్వితీయ వర్ష శిక్షావర్గలో ఆంద్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 270 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. మే 15న వర్గ ప్రారంభ సమావేశంలో ఆదరణీయ తెలంగాణ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ స్వయంసేవకులనుద్దేశించి మాట్లాడుతూ స్వయంసేవకుల జీవితంలో శిక్షావర్గ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే పలు సూచనలు చేశారు. జూన్ 3 సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ పశ్చిమ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ దేవేంద్ర ప్రధాన ఉపన్యాసం చేశారు. తెలంగాణ ఎక్సైజ్ మాజీ డిప్యూటీ కమిషనర్ శ్రీ చల్లా వివేకానంద రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శిక్షార్ధుల శారీరిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, ప్రజలు వచ్చారు. జూన్ 4న జరిగిన దీక్షాంత సమారోప్‌తో ప్రథమ, ద్వితీయ సంఘ శిక్షావర్గలు ముగిశాయి.