పునరుత్పాదక విద్యుత్తు విషయంలో అద్భుత ప్రగతి సాధించిన రాజస్తాన్, గుజరాత్,

పునరుత్పాదక విద్యుత్తు విషయంలో మన దేశంలోని రెండు రాష్ట్రాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్‌, రాజస్థాన్‌ వున్నాయి. మూడో స్థానంలో తమిళనాడు రాష్ట్రముంది. సౌర విద్యుత్తు ద్వారా 7,516 మెగావాట్లు, రూఫ్‌టాప్‌ సౌర ప్లాంట్‌ నుంచి 599 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. అయితే… పంట భూముల్లో మాత్రం సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడంలో రైతులు అంత సుముఖత వ్యక్తం చేయడం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిపై మరింత అవగాహన రావాల్సి వుంది. ఇప్పటి వరకు 66 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే భూముల నుంచి ఉత్పత్తి కాగా, మొత్తం సౌర విద్యుత్తు ద్వారా 8,211 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతోంది.

 

దేశం మొత్తం మీద పునరుత్పాదక విద్యుత్తు 1.9 లక్షల మెగావాట్లుగా వుంది. అందులో తమిళనాడు వాట 11.66 శాతంగా వుండటం గమనార్హం. మరోవైపు పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో అన్ని రాష్ట్రాల కన్నా గుజరాత్‌ 27,462 మెగావాట్లతో మొదటి ర్యాంకు, 27,103 మెగావాట్లతో రాజస్థాన్‌ రెండో ర్యాంకులో వుంది. తమిళనాడులోని థర్మల్‌ ప్లాంట్లు 4,320 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ రాష్ట్రం ప్రకటించింది. 34,706 మెగావాట్ల సామర్థ్యంలో 16,417 మెగవాట్లు సంప్రదాయ వనరుల మూలంగా సమకూర్చుకున్నారు. పునరుత్పాదక ఉత్పత్తి ద్వారా 18,288 మెగావాట్లు అందుతోంది. మొత్తం ఉత్పత్తి అయ్యే 34,706 మెగావాట్లలో సంప్రదాయ వనరుల ద్వారా వచ్చే విద్యుత్తు 50 శాతం వరకు వుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *