భారత మాత సుపుత్రుడు
చత్రపతి శివాజీ సాక్షాత్తూ పరమ శివుడి అంశతో జన్మించిన దైవాంశ సంభూతుడు. హైందవ ధర్మాన్ని రక్షించటానికి ఒక యుగ పురుషుడు ఉద్భవించబోతున్నాడని ఆకాలంలో మహారాష్ట్రలోని జ్యోతిష్య పండితులకు ముందుగా తెలుసు. సాధువులు, సంతులు కుతూహలంతో ఎదురు చూశారు. గత మూడు వందల సంవత్సరాలుగా భారతదేశంలో శివాజీ వంటి పరిపాలకుడు జన్మించలేదు. హిందువులను మ్లేచ్చుల కబంధహస్తాల నుండి విముక్తి చేయటానికి శివాజీ జన్మించాడు. మొగలుల పద ఘట్టనలతో నలిగిపోతున్న సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింప జేయటంలో శివాజీ విజయం సాధించాడు. ఆయన ఒక కథానాయకుడు, భక్తుడు, రాజర్షి. దేశంలోని చిన్న చిన్న రాజ్యాలు అన్నీ ఒకే ఛత్రం క్రిందకు వస్తాయని ఊహించిన యుగ పురుషుడు. జాతి ఆత్మను అభివ్యక్తీకరించే భారతమాత సుపుత్రుడు శివాజీ.
– స్వామి వివేకానంద