కుంభమేళాకి ప్రత్యేక రైళ్లు రద్దు కాలేదు.. నడుపుతున్నాం : రైల్వే ప్రకటన
మహా కుంభమేళా తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను తగ్గించిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు చేయలేదని.. అలాంటి ప్రతిపాదన కూడా తమవద్ద లేనే లేదని ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుంచి 360 రైళ్లను నడుపుతున్ననట్లు వెల్లడించింది. కాగా, తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వీలైనన్ని ఎక్కువ రైళ్లు నడపాలని కేంద్ర మంత్రిని యోగి కోరారు. ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకో ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. అలాగే రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరిన్ని స్పెషల్ రైళ్లను నడుపుతోంది.