ప్రపంచ ఖ్యాతినార్జించి.. ఆర్ధిక స్వావలంబన ఇస్తున్న ”కడియం నర్సరీ”

కడియం… ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది నర్సరీలు. సౌందర్య దృష్టికి , ఆర్ధిక  పుష్టికి ఆలవాలమైన ఈ తరహా సాగు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి గోదావరి తీరంలోని కడియం అనే గ్రామానికి వ్యాపించింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీల యజమానులు సాధించిన విజయాలు గొప్పగా అనిపిస్తాయి. వంద సంవత్సరాల క్రితం బెంగాలన, బెంగళూరు ప్రాంతాలలో నర్సరీ పని మొదలు పెట్టారు. తరువాత ఆకుల సుబ్బారావు భారత దేశం మొత్తం తిరిగి కడియం ఘనతను చాటి వచ్చారు. కడియం కీర్తిని విస్తరించారు. ఈ రోజున భారత దేశం మొత్తం ఇక్కడి నుంచి మొక్కలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే 10 దేశాలకు కూడా మొక్కలు ఎగుమతి చేస్తున్నారు. భారత దేశంలో పండే పూలు, పండ్లు, అలంకరించుకునే అనేక చెట్లు, పాదులు మలేషియా, థాయిలాండ్ , చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకొని వాటిని అభివృద్ధి  పరచి తిరిగి మళ్లీ దేశ, విదేశాలకు వీరు ఎగుమతి చేస్తారు.

రైతులు సర్ ఆర్థర్  కాటన్  కో ఆపరేటివ్ సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్  చేసుకొని సంఘటితంగా పనిచేస్తున్నారు.ఇందులో 2200 మంది సభ్యులున్నారు. కడియం మండలంలో మొత్తం 11 గ్రామాలకు గానూ 8 గ్రామాలలో సుమారు 7.5 వేల ఎకరాలలో మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. కడియంలో అభివృద్ధి  చేసే మొక్కలు ప్రత్యేకమైనవి. అందుకే వాటిని సాకడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఒక ఎకరానికి సుమారు 20,25 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. అంటే ఈ ప్రాంత నర్సరీల నిర్వాహకులు మొత్తం మీద సుమారుగా 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. చిన్నరైతులు మొక్కలను అంటుకట్టి పెద్ద నర్సరీలకు ఇస్తారు. వారు ఆ మొక్కలను పెంచుతూ విక్రయిస్తారు. చిన్న మామిడి అంటు 300 రూపాయలు వుంటే 5 సంవత్సరాల మొక్క 3 నుంచి 4 వేల రూపాయలు వుంటుంది.

ఇక్కడ దాదాపుగా 2000 రకాల మొక్కలు వున్నాయి. అలంకరణ కోసం పెంచే కొన్ని మొక్కల ఖరీదు 3 నుంచి 4 లక్షల రూపాయలు. ఇక్కడ దేశ, విదేశీ రకాల మొక్కలు ప్రవరÊధనం చేయడానికి 7 లేక 8 రకాల పదÊధతులలో అంటు కడతారు. బోన్సాయ్ వృక్షాలను  కూడా పెంచుతారు. అంటే మరుగుజ్జు మహా వృక్షాలు . బోన్సాయ్ చెట్లలో మామిడి, మర్రి కూడా దొరుకుతాయి. ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క వాతావరణం అవసరం. ఒక్కొక్క రకం పండు పండిరచాలంటే ఒక్కొక్క రకం నేల అవసరం. కానీ ఇక్కడ భారతదేశంలో పండే అన్ని రకాల పండ్ల మొక్కలను అభివృద్ధి  చేసి విక్రయిస్తారు. కశ్మీరు, సిమ్లా వంటి మంచు కొండల దగ్గరి ప్రాంతాలలో పండే ఆపిల్  మొక్కలు, హైదరాబాద్ లో పండే ద్రాక్ష వగైరా రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారు.

నర్సరీ పనికి భారీ పెట్టుబడి ఎంత అవసరమో, శ్రద్ద  కూడా అంతే అవసరం. గతంలో మట్టి పిడతలలో మొక్కలను పెట్టేవారు. ప్రస్తుతం ప్లాస్టికన సంచులను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలను పెంచేందుకు మొదట అవసరమైంది. సారవంతమైన మట్టి, దీని కోసం ఎర్రమట్టి, నల్లమట్టి, తేలిక మట్టి వంటి రకాలను తెచ్చి వర్మి కంపోసన్ట, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు కలిపి 6 నెలలు నిల్వ వుంచుతారు. ఇది పూర్తిగా ఎరువుగా మారి మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. వాటిని రసాయనిక ఎరువులు, పురుగు మందులతో రక్షించుకుంటారు. ఈ మధ్య కొంత మంది యజమానులు జీవామృతం , ఘనజీవామృతం , పంచగవ్యలను ఎరువులుగా, వేపాకుల కషాయం, వెల్లుల్లి, గోమూత్రముతో కీటక నియంత్రణిగా వాడటం ప్రారంభించారు. ఈ మొత్తం నర్సరీల పెంపకం, సంరక్షణ కోసం నైపుణ్యం కలిగిన వారు 15 వేల మంది శ్రమిస్తున్నారు. నెల జీతంతో కొంత మంది, గుత్తకు కొంతమంది పనిచేస్తున్నారు. నెల జీతంగా 15 నుంచి 25 వేల వరకు లభిస్తుంది. వీరు కాకుండా రోజువారీ పనిచేసే మహిళలు కొన్ని వేల మంది వుంటారు. ఇతర జిల్లాల నుంచి సుమారుగా 10 వేల మంది ఇక్కడే వుంటూ పనిచేస్తున్నారు. పరోక్షంగా పూలు అమ్మేవారు, సైకిలన మీద, ఆటోల మీద మొక్కలు గ్రామాలలో విక్రయిస్తూ అనేక మంది ఉపాధి పొందుతున్నారు.

ఇతర దేశాలకు పంపే మొక్కలు కొబ్బరి పొట్టుతో ప్రత్యేకంగా సంచిలో వేసి మద్రాసు నుంచి తూర్పు, మధ్య, తూర్పు దేశాలకు పంపుతూ ఆదాయం పొందుతున్నారు. ఈ రకంగా అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తూ మనకు దొరకని అనేక రకాల పూల, పండ్ల అలంకరణ, ఔషధ, ప్రాణవాయువును ఇచ్చే మొక్కలను పెంచి సమాజానికి అందజేసే గొప్పపని ఇక్కడ జరుగుతున్నది. దీని ద్వారా ఆదాయం మాత్రం సిÊథరంగా వుండదు. హెచ్చు తగ్గులు వుంటాయి. ఇక్కడ ఉత్పత్తులు వెంటనే అమ్ముడు అఇతే ఆదాయం సుమారు ఎకరాకు లక్ష రూపాయలు వుంటుంది. ఈ నర్సరీలను చూడడానికి రోజూ వేల మంది పర్యాటకులు వస్తుంటారు. దేశ విదేశాలలో గుర్తింపు కలిగిన కడియం నర్సరీ నిర్వాహకులు అనేకసార్లు జాతీయ స్థాయీ  పురస్కారాలు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *