ఆధ్యాత్మికానందం
కేవలం ఒక్క మీ క్రైస్తవ మతం మాత్రమే ఆధ్యాత్మిక ఆనందాన్నిస్తుందని భావిస్తున్నారా? ఇతర మతస్థులెవరికీ వారివారి విశ్వాసాల ఆధారంగా అలాంటి ఆధ్యాత్మికా నందం లభించడం లేదనడం ఎంత దారుణం? నాకు మాత్రం నా భగవద్గీత నుండే కావాల్సిన ఆధ్యాత్మికానందం, ప్రశాంతత, స్థైర్యం లభిస్తున్నాయి. ఇదే నా క్రైస్తవ మిత్రులకు ఈర్ష్య కలిగిస్తున్నదా?
క్రైస్తవ చర్చి విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కార్యక్రమాల ద్వారా మతం మారుస్తూ ఉంటే నేను తప్పనిసరిగా క్రైస్తవులను ఈ దేశం వదిలి వెళ్ళిపొమ్మని చెప్తాను. నా దృష్టిలో ఒక వ్యక్తి తిరిగి తన సొంత మతంలోకి రావడం మతమార్పిడి అనిపించుకోదు. భయంతోనో, ఆకలితోనో, భౌతిక సుఖాలపై ఆశతోనో, తప్పనిసరి పరిస్థితులలోనో వేరే మతంలోకి మారి, తిరిగి తన సొంత మతంలోకి రావాలనుకుంటే దాన్ని మత మార్పిడి అనడం అనుచితమవుతుంది. వేరే మతం పుచ్చుకుని పశ్చాత్తాపపడే వారిని హిందూ సమాజం ఏమాత్రం తటపటాయించకుండా అక్కున చేర్చుకోవాలని నేను నిస్సంకోచంగా పిలుపునిస్తున్నాను.
– మహాత్మా గాంధీ (హరిజన్ పత్రికలో)