ఔరంగజేబ్ మంచి పాలకుడు : అబు అజ్మీ వివాదాస్పద వ్యాఖ్య
అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అకృత్యాల పుట్ట ఔరంగజేబు మంచి పాలకుడంటూ తెగ ప్రశంసలు కురిపించారు.ఆయన అసలు క్రూరుడే కాదంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. సినిమాల ద్వారా ఔరంగజేబును క్రూరునిగా, వక్రీకరించి చూపుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
‘‘ఔరంగజేబు గురించి తప్పుడు విషయాలు చెబుతున్నారు. హిందువుల కోసం చాలా దేవాలయాలు నిర్మించాడు. ఓ అర్చకుని కుమార్తెను వివాహం చేసుకోవాలని తన సైన్యంలోని ఓ సైనికుడు ప్రయత్నిస్తే… ఏనుగులతో తొక్కించాడువారి కృతజ్ఞతకు చిహ్నంగా, వారు ముస్లింల కోసం ఒక మసీదును నిర్మించారు. చరిత్రను వక్రీకరించారు” అని అబూ అజ్మీ పేర్కొన్నారు.