దేవాలయాల నిర్వహణ గురువులకు అప్పగించాలి

హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతలను హిందూ ఆధ్యాత్మిక గురువులు, భక్తులకు అప్పగించాలి. టీటీడీ లడ్డూ మహా ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులు గుండె పగిలి తల్లడిల్లుతున్నాయి. ఈ సంఘటన 1857నాటి సిపాయిల తిరుగుబాటు జ్ఞాపకాలను తిరగదోడింది. ప్రసాదం కల్తీకి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, దేవాలయాల నిర్వహణ బాధ్యతలను హిందూ సాధువులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులకు అప్పగించాలి. హిందూ దేవాలయాల నిర్వహణను పర్యవేక్షించడానికి, వాటి పవిత్రతను కాపాడటానికి ఉత్తర, దక్షిణ భారతావనికి చెందిన ఆధ్యాత్మిక వేత్తలు, గురువులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. వివాదాలు తలెత్తినపుడు జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో ఉండవచ్చు.

-ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *