రాష్ట్రీయ జీవన స్రవంతి

నీ రక్తపు ప్రతి బిందువులోనూ ఎన్నివేల సంవత్సరాల సంస్కారం ఇమిడి వుందో, ఎన్నివేల సంవత్సరాల నుండి ఈ ప్రబల రాష్ట్రీయ జీవన స్రవంతి ఒక ప్రత్యేక దిశలో ప్రవహిస్తుందో, ఆ భగవంతుడికే తెలియాలి. సముద్రాన్ని సమీపించిన ఆ ప్రవాహం వెనుదిరిగి మళ్ళీ హిమాలయపు మంచు శిఖరాలపైకి మరలి పోగలదని భావిస్తున్నావా? అది అసంభవం! అలా ప్రయత్నించావో నీవె స్వయంగా నష్టపోతావు. కనుక ఈ జాతీయ జీవన స్రవంతిని యథాతథంగా ప్రవహించనీ, కావాలంటే అడ్డు తగిలే కట్టల్ని త్రెంచివేసి దాని మార్గాన్ని సుగమం చేసి ప్రవాహాన్ని నిరాఘాటంగా సాగనీ! ఇక చూడు! ఈ రాష్ట్రీయ జీవన స్రవంతి తన సహజ గతిలో ఉరకలేస్తూ మునుముందుకు పరుగిడుతుంది. అప్పుడు ఈ రాష్ట్రం సర్వాంగీణ ఉన్నతిని సాధిస్తూ చరమ లక్ష్యం వైపు హుందాగా సాగిపోతుంది.

– స్వామి వివేకానంద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *